లెగ్ స్లిప్‌లో స్టన్నింగ్ క్యాచ్.. వావ్.. భలే డైవ్ చేశాడు.. వీడియో వైరల్!

లెగ్ స్లిప్‌లో స్టన్నింగ్ క్యాచ్.. వావ్.. భలే డైవ్ చేశాడు.. వీడియో వైరల్!

Updated On : March 1, 2021 / 9:51 PM IST

slip fielder stunning catch leg-slip : దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫీల్డింగ్ చేయడంలో దిట్ట.. జోంటి రోడ్స్, హెర్షెల్ గిబ్స్, ఎబి డివిలియర్స్, డు ప్లెసిస్ నలుగురు అద్భుతమైన క్యాచ్ పట్టడంలో వీరికే వీరే సాటి.. గ్యారీ కిర్‌స్టన్, గ్రేమ్ స్మిత్, జాక్వెస్ కాలిస్ వంటి అద్భుతమైన స్లిప్ ఫీల్డర్లు ఉన్నారు. క్రికెట్‌లో స్లిప్ ఫీల్డింగ్ చాలా కష్టమనే చెప్పాలి. 50 ఓవర్ల ప్రావిన్షియల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాలో ఒక స్లిప్ ఆటగాడు.. అద్భుతమైన క్యాచ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. దక్షిణాప్రికా దేశవాళి క్రికెట్‌లో భాగంగా జరిగిన 50 ఓవర్‌ మ్యాచ్‌లో ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మార్టిన్‌ వాన్‌ జార్స్‌వెల్డ్‌ లెగ్ స్లిప్ లో స్టన్నింగ్ క్యాచ్ పట్టి అందరిని అబ్బురపరిచాడు.


బ్యాట్స్‌మెన్‌ బంతిని ఆడటానికి ముందే బంతిని పసిగట్టి, ఫస్ట్‌ స్లిప్‌ నుంచి లెగ్‌ సైడ్‌కు డైవ్‌ చేస్తూ క్యాచ్‌ పట్టుకున్నాడు. వికెట్‌కీపర్‌ వెనుక నుంచి డైవ్‌ చేస్తూ బంతిని రెండు చేతులతో ఒడిసిపట్టేశాడు. ఈ లెగ్ స్లిప్ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వావ్.. వాట్ ఏ క్యాచ్.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇలా క్యాచ్ పట్టడం దక్షిణాఫ్రికా దేశీయ టోర్నమెంటులో తొలిసారి కాదు. 2009లో మార్టిన్ వాన్ జార్స్ వెల్డ్ కూడా ఇలాంటి క్యాచ్ పట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రోటీస్ తరపున 9 టెస్టులు ఆడిన జార్స్ 11 వన్డేల్లో తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు.