IPL: ఢిల్లీ జట్టుపై ఏబీ డివిలియర్స్ ఫైర్.. సంచలన కామెంట్స్.. 15 ఏళ్ల నాటి షాకింగ్ నిజాలు..
"నన్ను రిటేన్ చేస్తామని మాట ఇచ్చారు. కానీ హఠాత్తుగా అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు" అని డివిలియర్స్ అన్నారు.

AB de Villiers
క్రికెట్ ప్రపంచంలో ‘మిస్టర్ 360’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఏబీ డివిలియర్స్ తాజాగా ఐపీఎల్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. ఐపీఎల్‌లో తొలి నాళ్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) జట్టులో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, అక్కడి “విషపూరిత వాతావరణాన్ని” గురించి 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు తొలిసారిగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
“ఆ జట్టులో వాతావరణం అసహ్యంగా ఉండేది”
ఒక ఇంటర్వ్యూలో ఏబీడీ మాట్లాడుతూ ఢిల్లీ జట్టులోని అంతర్గత పరిస్థితులపై తీవ్ర ఆరోపణలు చేశారు. “నేను పేర్లు చెప్పను, కానీ ఆ జట్టులో చాలా విషపూరితమైన, క్యాన్సర్ లాంటి క్యారెక్టర్లు ఉండేవి. అక్కడి వాతావరణం చాలా కఠినంగా, అసహ్యంగా అనిపించేది” అని అన్నారు.
“అప్పట్లో ఒక యువ ఆటగాడిగా నాకు పూర్తి మద్దతు లభించలేదు. కొన్నిసార్లు కనీసం నాలుగు మ్యాచ్‌లైనా ఆడతానో లేదో అనే భయం ఉండేది. అది చాలా కఠినమైన పరిస్థితి” అని చెప్పారు. అయితే, గ్లెన్ మెక్‌గ్రా, డేనియల్ వెటోరీ వంటి దిగ్గజాలతో గడిపిన సమయం మాత్రం అద్భుతమని ఆయన గుర్తుచేసుకున్నారు.
Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఒకేసారి 3 కొత్త బైకులు.. మార్కెట్ షేక్.. వివరాలు లీక్..
ఆ ఒక్క నిర్ణయంతో మారిన కెరీర్
ఐపీఎల్- 2009 సీజన్‌లో ఢిల్లీ తరఫున 465 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ 2010లో ఫ్రాంచైజీ ఏబీడీని వదులుకుంది. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ.. “నన్ను రిటేన్ చేస్తామని మాట ఇచ్చారు. కానీ హఠాత్తుగా నా పేరు వేలంలో చూసి షాక్ అయ్యాను. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. అదొక విచిత్రమైన అనుభవం” అని డివిలియర్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్‌సీబీలో ‘మిస్టర్ 360’ ప్రభంజనం
ఢిల్లీ వదులుకున్న ఆ ముత్యమే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు ఒక వజ్రంగా మారింది. ఆర్‌సీబీ తరఫున డివిలియర్స్ ఆడిన తీరు అసాధారణం.
లెక్కలు ఇలా..
- మొత్తం పరుగులు: 5,162
- శతకాలు: 3
- అర్ధశతకాలు: 40
- స్ట్రైక్ రేట్: 151.68
డివిలియర్స్ వ్యాఖ్యలు ఆయన గొప్ప కెరీర్ వెనుక ఉన్న కష్టాలను, అవమానాలను తెలియజేస్తున్నాయి. ఢిల్లీ జట్టులో సరైన ప్రోత్సాహం లభించి ఉంటే, ఆ జట్టు చరిత్ర మరోలా ఉండేదేమోనని అభిమానులు అంటున్నారు.