PAK vs ZIM : అరంగ్రేట మ్యాచ్‌లో పాక్ బౌల‌ర్ అరుదైన ఘ‌న‌త‌..

పాకిస్థాన్ స్పిన్ బౌల‌ర్ అబ్రార్‌ అహ్మద్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Abrar Ahmed

పాకిస్థాన్ స్పిన్ బౌల‌ర్ అబ్రార్‌ అహ్మద్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. అరంగ్రేట మ్యాచ్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన పాకిస్థాన్ బౌల‌ర్‌గా నిలిచాడు. జింబాబ్వేతో జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్ ద్వారా వ‌న్డేల్లో అరంగ్రేటం చేసిన ఈ ఆట‌గాడు తొలి మ్యాచ్‌లో అద‌ర‌గొట్టాడు. నాలుగు వికెట్లు తీశాడు. ఈ క్ర‌మంలో ఎలైట్ లిస్ట్‌గా చోటు ద‌క్కించుకున్నాడు.

వ‌న్డే అరంగ్రేట మ్యాచులో అత్య‌ధిక వికెట్లు తీసిన పాక్ బౌల‌ర్ల‌లో అబ్దుల్‌ ఖాదిర్ తో క‌లిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. 1984లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అబ్దుల్‌ ఖాదిర్‌ కూడా తన అరంగేట్రంలో 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. వీరిద్ద‌రితో పాటు జాకిర్‌ ఖాన్‌, సర్ఫరాజ్‌ నవాజ్‌ కూడా పాక్‌ తరఫున వన్డే అరంగేట్రంలో నాలుగు వికెట్లు తీశారు.

Prithvi Shaw : ఐపీఎల్ మెగావేలం త‌రువాత‌.. పృథ్వీ షా పాత వీడియో వైర‌ల్‌..

వ‌న్డే అరంగ్రేట మ్యాచులో అత్య‌ధిక వికెట్లు తీసిన పాక్ బౌల‌ర్లు..

జాకీర్ ఖాన్ – 1984లో న్యూజిలాండ్ పై – 4 వికెట్లు
అబ్దుల్ ఖాదిర్ – 1984లో న్యూజిలాండ్ పై – 4 వికెట్లు
అబ్రార్ అహ్మ‌ద్ – 2024లో జింబాబ్వే పై – 4 వికెట్లు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. త‌ద్వారా తొలి వ‌న్డేలో ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో మొద‌ట‌ బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 32.3 ఓవర్లలో 145 పరుగులకే కుప్ప‌కూలింది. అనంత‌రం సైమ్‌ అయూబ్ విధ్వంస‌క‌ర శ‌త‌కంతో పాక్ 18.2 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా విజ‌యాన్ని అందుకుంది. సైమ్ అయూబ్ 62 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాది 113 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. పాక్‌ తరఫున వన్డేల్లో ఇది మూడో వేగ‌వంత‌మైన శ‌త‌కం.

IND vs AUS : గెలుపు జోష్‌లో ఉన్న భార‌త్ కు మ‌రో షాక్‌.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయ‌ర్ దూరం!