IND vs AUS Test Match: ఇండియా, ఆసీస్ రెండో టెస్టు నుంచి మరో టీమిండియా క్రికెటర్ దూరం .. నిబంధనల ప్రకారం ..

ఇండియా వర్సెస్ ఆసీస్ మొదటి టెస్టులో జయదేవ్ ఉనద్కత్‌కు తుది జట్టులో అవకాశం రాలేదు. అయితే అతను సౌరాష్ట్ర తరపున రంజీ ఫైనల్స్ లో ఆడేందుకు వెళ్లనున్నాడు. తాజాగా మరో టీమిండియా ప్లేయర్‌సైతం ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IND vs AUS Test Match: ఇండియా, ఆసీస్ రెండో టెస్టు నుంచి మరో టీమిండియా క్రికెటర్ దూరం .. నిబంధనల ప్రకారం ..

Team India

Updated On : February 14, 2023 / 10:17 AM IST

IND vs AUS Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ స్వదేశంలో జరుగుతుంది. ఇప్పటికే తొలి టెస్ట్ మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను టీమిండియా చిత్తు చేసింది. 132 పరుగుల భారీ ఆధిక్యంతో తొలి వన్డేలో ఇండియా విజయం సాధించింది. రెండో టెస్టు మ్యాచ్ ఈనెల 17 నుంచి ఢిల్లీ వేదికగా జరుగుతుంది. రెండో టెస్టును ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రెండో టెస్టులో విజయం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌కు చేరుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు ఆసీస్.. మొదటి టెస్టు ప్రతీకారాన్ని రెండో టెస్టులో విజయం ద్వారా తీర్చుకోవాలని భావిస్తోంది.

IND vs AUS Test Match: ఇండియా, ఆసీస్ మూడో టెస్ట్ మ్యాచ్ వేదిక మారింది.. ట్వీట్ చేసిన బీసీసీఐ

ఇదిలాఉంటే ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టు నుంచి ఇప్పటికే జయదేవ్ ఉనద్కత్‌ను సెలక్టర్లు తప్పించిన విషయం విధితమే.  మొదటి టెస్టులో ఉనద్కత్‌కు తుది జట్టులో అవకాశం రాలేదు. అయితే అతను సౌరాష్ట్ర తరపున రంజీ ఫైనల్స్ లో ఆడేందుకు వెళ్లనున్నాడు. తాజాగా మరో టీమిండియా ప్లేయర్‌సైతం ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీటీఐ నివేదిక ప్రకారం.. భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ను రెండో టెస్టు నుంచి సెలెక్టర్లు తప్పించినట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఉంది.. అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంగా న్యూజీలాండ్ వన్డే సిరీస్‌కు శ్రేయాస్ దూరమయ్యాడు. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్నాడు. ట్రైనర్ రజనీకాంత్ పర్యవేక్షణలో ఎన్‌సీఏలో శ్రేయాస్ శిక్షణ పొందుతున్నాడు.

IND vs AUS 1st Test Match: తొలిటెస్టులో ఆసీస్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం .. మూడోరోజు ఆట ఫొటోలు

గాయం కారణంగా కొంతకాలం క్రికెట్ దూరమైన శ్రేయాస్ రెండో టెస్టులో తుదిజట్టులో ఆడాలంటే దేశీయ మ్యాచ్‍లలో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలి. శ్రేయాస్ మాత్రం నెలరోజుల నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. రంజీ ట్రోఫీ దాదాపు ముగియడంతో అయ్యర్ తన ఫిట్‌నెస్ నిరూపించుకోవటానికి మార్చి 1-5 వరకు మధ్యప్రదేశ్ లో జరిగే ఇరానీ కప్ మ్యాచ్ లో రెస్ట్ ఆప్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. గాయం కారణంగా క్రికెట్‌కు కొంతకాలం దూరమయిన ఆటగాళ్లు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ నిరూపించుకొనేందుకు దేశీయ క్రికెట్ మ్యాచ్‌లలో ఆడాల్సి ఉంటుంది. తొలి టెస్టులో బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజా సైతం టెస్టు మ్యాచ్ లోకి ఎంట్రీకి ముందు తమిళనాడులో రంజీ ట్రోఫీమ్యాచ్ ఆడాడు. ఆ తరువాత ఆసీస్ వర్సెస్ ఇండియా తొలి టెస్టు మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న విషయం విధితమే.