టీ20 క్రికెట్‌లో ధోని రికార్డును బద్దలు కొట్టిన మహిళా క్రికెటర్

Alyssa Healy broke MS Dhoni’s record: మహిళల ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలిస్సా హీలీ ఆదివారం(27 సెప్టెంబర్ 2020) నాడు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టింది. అంతర్జాతీయ క్రికెట్(T20I) ఫార్మాట్‌లో వికెట్ కీపర్‌గా ఆమె ఈ ఘనతను సాధించారు. బ్రిస్బేన్‌లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్‌లో హీలీ ఈ ఘనతను సాధించారు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టు.. న్యూజిలాండ్ మహిళా జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చెయ్యగా.. ఆస్ట్రేలియా 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
భారత్ తరఫున ధోని 98 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 91 మందిని అవుట్ చేసి వికెట్ కీపర్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. హిల్లీ ఆస్ట్రేలియా తరఫున 114టీ 20 మ్యాచ్‌లు ఆడి 92 మందిని వికెట్ కీపర్‌గా అవుట్ చేసా ధోని రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 (ఐపిఎల్ 2020) లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తరఫున ప్రస్తుతం ధోని ఆడుతుండగా.. ఆగస్టు 15 న అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు, న్యూజిలాండ్‌తో జరిగిన టీ 20 సిరీస్ తర్వాత, హీలీ ఆస్ట్రేలియా తరఫున జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడనుంది.
ఈ రికార్డ్ విషయంలో ఇంగ్లాండ్‌కు చెందిన సారా టేలర్ మూడవ స్థానంలో ఉంది, ఆమె మొత్తం 74 మందిని కీపర్‌గా అవుట్ చేశారు.. దీని తరువాత న్యూజిలాండ్‌కు చెందిన రాచెల్ ప్రీస్ట్ (72) ఉన్నారు. తర్వాత వెస్టిండీస్ మారిస్సా అగ్యిలేరా (70) ఉన్నారు. ఈ జాబితాలో 63 మందిని అవుట్ చేసి వెస్టిండీస్‌కు చెందిన దినేష్ రామ్‌దిన్ తర్వాతి స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్‌కు చెందిన ముష్‌ఫీకర్ రహీమ్ 61 మందిని అవుట్ చేశాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. బౌచర్ 15 సంవత్సరాల కెరీర్‌లో 467 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 998మందిని పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత ఆడమ్ గిల్‌క్రిస్ట్ (396 ఆటలలో 905), ధోని (538 మ్యాచ్‌ల్లో 829) ఉన్నారు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 195 స్టంపింగ్‌లు చేశాడు. ఇదే ఇప్పటివరకు ప్రపంచంలో అత్యుత్తమ రికార్డు.