Ambati Rayudu: ధోని అలా చేయడానికి కారణం అదే.. నిజంగా ఆ క్షణం ప్రత్యేకం
ధోని అంటే అదే మరీ. అతడిలా ఉండడం ఎవ్వరికి సాధ్యం కాదు. అతడు ఎలాంటి వాడో ప్రపంచం మొత్తానికి తెలుసని రాయుడు ఓ ఆంగ్ల మీడియాకు తెలిపాడు.

Ambati Rayudu
Ambati Rayudu – MS Dhoni: ఇటీవల ముగిసిన ఐపీఎల్ ఫైనల్(IPL Final) మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)ను ఓడించి రికార్డు స్థాయిలో ఐదోసారి కప్పును గెలుచుకుంది. ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా రవీంద్ర జడేజా(Ravindra Jadeja) సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైకి అద్వితీయ విజయాన్ని అందించాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈమ్యాచ్‌లో తెలుగు తేజం అంబటి రాయుడు(Ambati Rayudu) కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 19 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంబటి రాయుడికి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ అన్న సంగతి తెలిసిందే.
ఇక చెన్నై జట్టు విజయం సాధించిన తరువాత ప్రెజెంటేషన్ వేడుకలో ఐపీఎల్ టైటిల్‌ను అంబటి రాయుడు, జడేజాలతో కలిసి ధోని అందుకున్నాడు. దీనిని ముందుగా ఎవ్వరూ ఊహించలేదు. ఇలా అంబటి రాయుడుని, జడ్డూని ధోని పిలవడానికి గల కారణాన్ని తాజాగా రాయుడు బయటపెట్టాడు. ‘వేడుకకు ముందు ధోని నన్ను మరియు జడ్డూనూ పిలిచాడు. ట్రోఫీని అందుకునే సమయంలో నన్ను, జడేజాను అతడితో కలిసి రావాలని చెప్పాడు. మా ఇద్దరితో కలసి ట్రోఫీని తీసుకోవడం సరైనదని మహేంద్రుడు భావించాడు. అది నిజంగా అద్భుతమైన క్షణం. ఇంతముందు ఎప్పుడూ జరగలేదు. ధోని అంటే అదే మరీ. అతడిలా ఉండడం ఎవ్వరికి సాధ్యం కాదు. అతడు ఎలాంటి వాడో ప్రపంచం మొత్తానికి తెలుసు’ అని రాయుడు ఓ ఆంగ్ల మీడియాకు తెలిపాడు.
ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత ధోని మాట్లాడుతూ రాయుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానంలో ఉంటే 100 శాతం శ్రమించడం రాయుడి లక్షణం అని చెప్పాడు. ‘మేము ఇద్దరం ఇండియా ఎ తరుపున కలిసి ఆడాం. రాయుడు పేస్, స్పిన్‌ను రెండింటిని సమర్థవంతంగా ఆడగల నైపుణ్యం అతడి సొంతం. అతడు జట్టు కోసం ఏదైన చేస్తాడని నేను నమ్ముతాను. ఇక నాలాగే రాయుడుకి కూడా ఎక్కువగా ఫోన్ వాడే అలవాటు లేదు’ అని ధోని అన్నాడు.
2010లో ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్ లో అరంగ్రేటం చేశాడు అంబటి రాయుడు. మొత్తంగా 204 మ్యాచ్‌లు ఆడి 28.29 సగటులతో 4,348 పరుగులు చేశాడు. ఇందులో 23 అర్ధశతకాలు ఉన్నాయి. మొత్తంగా రాయుడు ఆరు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరుపున 2013, 2015, 2017 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున 2018, 2021, 2023లో టైటిళ్లలను అందుకున్నాడు.
MS Dhoni: శుభవార్త.. ధోని మోకాలి ఆపరేషన్ సక్సెస్