India vs Australia T20I series: ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌కు కోహ్లీ… ‘ఈ వ్యక్తిని మిస్ అవుతున్నా’నంటూ అనుష్క శర్మ వ్యాఖ్యలు

‘‘ప్రపంచం ఇలా మరింత వెలిగిపోతోంది.. ఉత్సాహవంతం అవుతోంది.. మరింత సంబరపడుతోంది.. హోటల్ లో బయో బబుల్ లో ఈ వ్యక్తితో ఉన్న సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మాత్రం హబ్బీ (భర్త)ని మిస్ అవుతున్నాను’’ అని అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. కాగా, అనుష్క శర్మ ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో నటిస్తోంది. షూటింగ్ నిమిత్తం ఆమె లండన్ లో ఉంది.

India vs Australia T20I series: ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌కు కోహ్లీ… ‘ఈ వ్యక్తిని మిస్ అవుతున్నా’నంటూ అనుష్క శర్మ వ్యాఖ్యలు

India vs Australia T20I series

Updated On : September 18, 2022 / 9:40 AM IST

India vs Australia T20I series: ‘ఈ వ్యక్తిని మిస్ అవుతున్నా’ అంటూ విరాట్ కోహ్లీతో తాను గతంలో దిగిన ఫొటో పోస్ట్ చేసిన హీరోయిన్ అనుష్క శర్మ పోస్ట్ చేసింది. ఎల్లుండి నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ భారత్ లో ఉండగా, అనుష్క శర్మ మాత్రం లండన్ లో ఉండిపోయింది. దీంతో కోహ్లీ, తాను గతంలో తీసుకున్న ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ దానిపై పలు వ్యాఖ్యలు చేసింది.

‘‘ప్రపంచం ఇలా మరింత వెలిగిపోతోంది.. ఉత్సాహవంతం అవుతోంది.. మరింత సంబరపడుతోంది.. హోటల్ లో బయో బబుల్ లో ఈ వ్యక్తితో ఉన్న సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు మాత్రం హబ్బీ (భర్త)ని మిస్ అవుతున్నాను’’ అని అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. కాగా, అనుష్క శర్మ ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో నటిస్తోంది. షూటింగ్ నిమిత్తం ఆమె లండన్ లో ఉంది. ఇటీవల లండన్ లో అనుష్కతో విరాట్ కోహ్లీ చక్కర్లు కొట్టిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా, మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఎల్లుండి తొలి టీ20 జరగనుంది. ఇప్పటికే కోహ్లీతో పాటు టీమిండియా అక్కడకు చేరుకుంది.

Coriandrum Prices: భారీగా పెరిగిన కొత్తిమీర ధర.. కిలో ఏకంగా రూ.400 పలుకుతున్న వైనం