రూల్ ప్రకారమే ఆడా.. ఆ పద్ధతి తప్పేం కాదు

రూల్ ప్రకారమే ఆడా.. ఆ పద్ధతి తప్పేం కాదు

Updated On : March 26, 2019 / 9:33 AM IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసింది ముమ్మాటికి తప్పేనంటూ నెటిజన్లు విమర్శిస్తుంటే తాను రూల్స్ ప్రకారమే చేశానని చెప్పుకొస్తున్నాడు అశ్విన్. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను రనౌట్ చేసిన విధానం తీవ్ర చర్చనీయాంశమైంది. థర్డ్ అంపైర్ తీర్పు పంజాబ్ జట్టుకు అనుకూలంగానే వచ్చినా ఆ జట్టుతో పాటు అశ్విన్‌ను సైతం తిట్టిపోస్తున్నారు క్రీడాభిమానులు. 

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు రాజస్థాన్‌కు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో భాగంగా దూకుడుగా ఆడుతున్న రాజస్థాన్‌ను కట్టడి చేయాలని తీవ్రంగా ప్రయాణించింది అశ్విన్ సేన. ఈ క్రమంలో 13వ ఓవర్లో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బట్లర్‌ అశ్విన్ బౌలింగ్ వేయబోతుండగా, పరుగుతీసే క్రమంలో ముందుకొచ్చేశాడు. ఇదే అదనుగా చేసుకుని బౌలర్ అశ్విన్ మన్కడింగ్ పద్ధతి ద్వారా బట్లర్‌ను అవుట్ చేశాడు.

‘నేను చేసింది ముమ్మాటికి తప్పేం కాదు.. రూల్స్ ప్రకారమే ఆడా. క్రీడా స్ఫూర్తి అని మాట్లాడుతున్నారు. గేమ్‌లో రూల్స్‌కి మినహాయింపేం కాదు కదా’ అని అభిప్రాయపడ్డాడు. ఈ ఘటనపై జోస్ బట్లర్‌తో పాటు రాజస్థాన్ కెప్టెన్ అజింకా రహానె, కోచ్ ప్యాడీ అప్టన్ అంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.