Asia Cup 2021: ఆసియా కప్ 2021 వాయిదా.. మళ్లీ 2023లోనే

ఆసియా కప్ 2021 ఎడిషన్ వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నిర్వహించడం సాధ్యపడకపోవడంతో క్రికెట్ క్యాలెండర్ ప్రకారం 2023లోనే నిర్వహించాలని ఫిక్స్ ....

Asia Cup 2021: ఆసియా కప్ 2021 వాయిదా.. మళ్లీ 2023లోనే

Asia Cup 2021

Updated On : May 23, 2021 / 8:22 PM IST

Asia Cup 2021: ఆసియా కప్ 2021 ఎడిషన్ వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నిర్వహించడం సాధ్యపడకపోవడంతో క్రికెట్ క్యాలెండర్ ప్రకారం 2023లోనే నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కొవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా టోర్నమెంట్ వాయిదా వేయాల్సి వచ్చింది.

ఈ ఏడాది జరగాల్సిన టోర్నమెంట్ ను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మార్చినప్పటికీ అక్కడా కేసుల నమోదు ఎక్కువగానే ఉంది. దీంతో క్యాన్సిల్ చేయకతప్పలేదు. ఈ సంవత్సరం మొత్తం ఆసియా జట్లన్నీ షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నాయి.

ఈ విషయంపై జాగ్రత్తగా ఆలోచించి వాయిదా వేయడం ఒక్కటే మార్గమని ఫిక్స్ అయ్యాం. 2023లోనే మళ్లీ ఎడిషన్ జరుగుతుంది. ఎందుకంటే 2022లో జరగాల్సిన ఆసియా కప్ ఎలాగూ జరుగుతుంది. తేదీలు మరోసారి చర్చించి కన్ఫామ్ చేయాల్సి ఉంది.

అక్టోబర్-నవంబర్ మధ్యలో ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. 2018 తర్వాత ఆసియా కప్ జరిగిందే లేదు. 2020లో ప్లాన్ చేసినప్పటికీ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. చివరి రెండు ఎడిషన్లు టోర్నమెంట్ ను ఇండియానే గెలిచింది.