Asia Cup 2023 : టీమ్ఇండియాపై వ‌రుణుడికి ఎంత ప్రేమో..! రావ‌ద్ద‌న్నా వ‌స్తున్నాడుగా..? నేపాల్‌తో మ్యాచ్ కూడా..

వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌(ODI World cup)కు మ‌రో నెల రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో ఆసియా క‌ప్‌(Asia Cup)లోని మ్యాచ్‌ల‌ను ఇందుకు స‌న్న‌ద్ధంగా ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్న భార‌త జ‌ట్టు ఆశ‌లు తీరేట‌ట్లు క‌నిపించ‌డం లేదు.

Asia Cup 2023 : టీమ్ఇండియాపై వ‌రుణుడికి ఎంత ప్రేమో..! రావ‌ద్ద‌న్నా వ‌స్తున్నాడుగా..? నేపాల్‌తో మ్యాచ్ కూడా..

Pallekele weather forecast for India vs Nepal

Asia Cup : వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌(ODI World cup)కు మ‌రో నెల రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో ఆసియా క‌ప్‌(Asia Cup)లోని మ్యాచ్‌ల‌ను ఇందుకు స‌న్న‌ద్ధంగా ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్న భార‌త జ‌ట్టు ఆశ‌లు తీరేట‌ట్లు క‌నిపించ‌డం లేదు. అందుకు వ‌రుణుడే కార‌ణం. ప‌ల్లెక‌లె వేదిక‌గా శ‌నివారం దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు వ‌రుణుడు ఆటంకం క‌లిగించాడు. భార‌త ఇన్నింగ్స్ సంద‌ర్భంగా ప‌లుమార్లు అంత‌రాయం క‌లిగించాడు. ఇన్నింగ్స్ ముగిసిన వెంట‌నే మొద‌లైన వ‌ర్షం ఎంత‌కీ త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ను అంపైర్లు ర‌ద్దు చేశారు.

Asia Cup 2023 : భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్‌లో ప్ర‌భాస్ పాట‌.. బౌండ‌రీ కొట్టిన ప్ర‌తిసారి..!

ఆసియా క‌ప్‌లో భార‌త్ త‌న రెండో మ్యాచ్‌ను నేపాల్‌తో సోమ‌వారం (సెప్టెంబ‌ర్ 4న‌) ఆడ‌నుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు కూడా వ‌ర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే రోజు 80 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్‌ కూడా ప‌ల్లెక‌లె వేదిక‌గానే జ‌ర‌గ‌నుంది. వ‌ర్షం కార‌ణంగా టాస్ కూడా ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స్థానిక మీడియా అంచనా వేస్తోంది. ఒక‌వేళ‌.. ఈ మ్యాచ్ కూడా వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయిన‌ప్ప‌టికీ భార‌త్‌కు వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేదు.

Spirit of cricket : మ్యాచ్‌లో దీన్ని గ‌మ‌నించారా..! హార్దిక్ షూ లేస్ క‌ట్టిన పాక్ క్రికెట‌ర్‌.. ఎవ‌రో తెలుసా..?

భార‌త్ ఈజీగా సూప‌ర్ 4 ద‌శ‌కు అర్హ‌త సాధిస్తుంది. నేపాల్ ఏదైన సంచ‌నాలు చేస్తే త‌ప్పిస్తే భార‌త్‌కు వ‌చ్చిన న‌ష్టం లేదు. అయితే.. వ‌ర్షం రాకుండా మ్యాచ్ పూర్తిగా సాగితే భార‌త ఆట‌గాళ్ల‌కు కావాల్సిన‌ మ్యాచ్ ప్రాక్టీస్ ల‌భిస్తుంది. ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా సూప‌ర్ 4కు ద‌శ‌కు అర్హ‌త సాధిస్తే సెప్టెంబ‌ర్ 10న భార‌త్‌, పాకిస్తాన్‌లు మ‌రోసారి త‌ల‌ప‌డ‌తాయి.