టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బ్యాటింగ్

  • Published By: vamsi ,Published On : January 14, 2020 / 08:02 AM IST
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్ బ్యాటింగ్

Updated On : January 14, 2020 / 8:02 AM IST

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతున్నది. తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుని భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. రెండో వన్డే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 17న, మూడో వన్డే 19న బెంగుళూరులో జరుగనున్నాయి. 

పూర్తి స్థాయి బలాలతో రెండు జట్లు బరిలోకి దిగుతుండటంతో ఈ వన్డే సిరీస్‌ హోరాహోరీగా జరగనుంది. సొంతగడ్డపై బలహీన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలతో వరుసగా గెలిచిన ఇండియాకు ఈ సిరీస్ అసలైన పరీక్ష కానుంది. 2019 మార్చిలో భారత్‌లోనే జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియా గెలవగా.. చివరి మూడు గెలిచిన ఆసీస్‌ సిరీస్‌ సొంతం చేసుకుంది.
 
జట్ల వివరాలు:
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, అయ్యర్, పంత్‌ (కీపర్‌), జడేజా, శార్దుల్, కుల్దీప్, బుమ్రా, షమీ.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్, స్మిత్, లబ్‌షేన్, క్యారీ, అగర్, జంపా, స్టార్క్, కమిన్స్‌, ఆష్టన్‌ టర్నర్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌