AUS vs IND: ఫస్ట్ T20 నేడే.. వరల్డ్ కప్ టీమ్ సెట్ అవుతుందా?

వన్డే సిరీస్‌లో ఓటమి తర్వాత భారత జట్టు మూడో వన్డేలో గెలిచి పరువు నిలపగా.. ఇప్పుడు సిరీస్‌లో ఓడించిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుని, టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది భారత్.. సొంత గడ్డపై చెలరేగి ఆడుతున్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో భారత్‌పై నెగ్గి టీ20 సిరీస్ కూడా దక్కించుకోవాలని కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే.. తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:40నిమిషాలకు ప్రారంభం కాబోతుంది.
టీమిండియా నుంచి ముగ్గురు అవుట్:
టీ20 సిరీస్‌లో షుబ్మాన్ గిల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు పాల్గొనరని ఇప్పటికే జట్టు ప్రకటించింది. అయితే, ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియాతో షుబ్మాన్ గిల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ కొనసాగుతారు. ఈ ఆటగాళ్లను టీం ఇండియాతో రిజర్వ్ ప్లేయర్‌లుగా పరిగణిస్తుంది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో షుబ్మాన్ గిల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లకు ఆడే అవకాశం లభించింది. ఇవే కాకుండా టీ20 సిరీస్ కోసం ఇద్దరు కొత్త ఆటగాళ్ళు టీమ్ ఇండియాలో చేరనున్నారు. దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ ఐపిఎల్ నుంచి నేరుగా ఆస్ట్రేలియా చేరుకున్నారు, ఇప్పుడు వారికి టి20 సిరీస్‌లో ఆడే అవకాశం ఉండవచ్చు. అయితే జడేజా మంచి ఫామ్‌లో ఉండగా.. వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం రావడం కష్టమే.
ఆస్ట్రేలియా జట్టులో మార్పులు ఉండకపోవచ్చు:
ఆస్ట్రేలియా జట్టులో 20-20 సిరీస్ కోసం ఎటువంటి మార్పులు చేయలేదు. మూడవ వన్డేకు ముందు పరిమిత ఓవర్ల సిరీస్ నుండి డేవిడ్ వార్నర్ నిష్క్రమించగా.. డేవిడ్ వార్నర్ స్థానంలో డార్సీ షార్ట్ ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చాడు. అయితే పాట్ కమ్మిన్స్‌కు విశ్రాంతి ఇవ్వగా.. అతని ప్లేస్‌లో కొత్తగా ఎవరినీ తీసుకోలేదు. వన్డే సిరీస్‌కు ముందు రెండు మ్యాచ్‌లు గెలిచి ఆస్ట్రేలియా జట్టు టీమ్ ఇండియాపై మానసికంగా ఒత్తిడి ఉంది. కానీ గత వన్డేలో 13 పరుగుల తేడాతో గెలిచిన తరువాత టీమిండియాకి విశ్వాసం పెరిగింది.
ఈ క్రమంలోనే ‘భారత బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయలేరు.. భారత బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు’ అనే మాట ఎక్కువగా వినిపిస్తుండగా.. టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్‌లకు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. టీమిండియా ప్రధాన ఆటగాళ్లు రాహుల్, ధావన్, హార్దిక్, బుమ్రా ఐపీఎల్‌లో రాణించగా.. ఇప్పుడు కూడా రాణించే అవకాశం కనిపిస్తుంది. మరో వైపు ఐపీఎల్‌లో విఫలమైన ఆసీస్ క్రికెటర్లు స్మిత్, మ్యాక్స్‌వెల్ ఇక్కడ సత్తా చాటవచ్చు. ఇక భారత్, ఆస్ట్రేలియాలు వరల్డ్ కప్‌కు ఫేవరేట్లు కావడంతో ఈ రెండు జట్లు వారి టీమ్‌లను సెట్ చేసుకునేందుకు ఇదొక అవకాశంగా భావస్తున్నాయి. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ కావడంతో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. భారత్, ఆసీస్ మధ్య జరిగిన టి20ల్లో ఇప్పటివరకు భారత్ 11 గెలిచి 8 ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
Possible XI: ఆరోన్ ఫించ్ (c), మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, మొయిసెస్ హెన్రిక్స్, అలెక్స్ కేరీ (wk), గ్లెన్ మాక్స్‌వెల్, అష్టన్ అగర్, సీన్ అబోట్, మిచెల్ స్టార్క్/ఆండ్రూ టై, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జాంపా
Possible XI: శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ (WK), విరాట్ కోహ్లీ(C), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, T నటరాజన్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా