IND-W vs AUS-W 2nd ODI : ఉత్కంఠ పోరులో భార‌త మ‌హిళ‌ల ఓట‌మి.. రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా విజ‌యం

భార‌త్‌తో జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఓట‌మి పాలైన ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు త‌మ‌కు అచ్చొచ్చిన వ‌న్డేల్లో మాత్రం విజృంభిస్తోంది.

IND-W vs AUS-W 2nd ODI : ఉత్కంఠ పోరులో భార‌త మ‌హిళ‌ల ఓట‌మి.. రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా విజ‌యం

IND-W vs AUS-W 2nd ODI

Updated On : December 30, 2023 / 9:30 PM IST

India Women vs Australia Women 2nd ODI : భార‌త్‌తో జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఓట‌మి పాలైన ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు త‌మ‌కు అచ్చొచ్చిన వ‌న్డేల్లో మాత్రం విజృంభిస్తోంది. వ‌రుస‌గా రెండో వ‌న్డేలోనూ గెలుపొందింది. ఈ క్ర‌మంలో మ‌రో మ్యాచ్‌ మిగిలి ఉండ‌గానే మూడు వ‌న్డేల సిరీస్‌ను గెలుచుకుంది. ముంబై వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచులో 3 ప‌రుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది.

259 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 255 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రిచా ఘోష్ (96; 117 బంతుల్లో 13 ఫోర్లు) తృటిలో సెంచ‌రీని చేజార్చుకుంది. జెమిమా రోడ్రిగ్స్ (44; 55 బంతుల్లో 3 ఫోర్లు), స్మృతి మంధాన (34; 38 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించినా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో భార‌త్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో అన్నాబెల్ సదర్లాండ్ మూడు వికెట్లు తీసింది. జార్జియా వేర్‌హామ్ రెండు, అలనా కింగ్‌, కిమ్ గార్త్, ఆష్లీ గార్డనర్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Sanju Samson : ఫుట్‌బాల‌ర్ అవ‌తారం ఎత్తిన సంజూ శాంస‌న్‌.. క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడా ఏంటి..?

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 258 ప‌రుగులు చేసింది. ఫోబ్ లిచ్ఫీల్డ్ (63; 98 బంతుల్లో 6 ఫోర్లు), ఎలిస్ పెర్రీ (50; 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌)లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. అలీసా హీలీ (13), బెత్ మూనీ (10), ఆష్లీన్ గార్డ్‌న‌ర్ (2) విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ మెక్‌గ్రాత్ (24), జార్జియా వేర్‌హాయ్ (22), అనాబెల్ స‌ద‌ర్లాండ్ (23) రాణించారు. భార‌త స్పిన్న‌ర్ దీప్తి శ‌ర్మ ఐదు వికెట్లు తీసింది. పూజా వ‌స్త్రాక‌ర్‌, శ్రేయంక పాటిల్‌, స్నేహ్ రాణాల‌కు త‌లా ఓ వికెట్ ద‌క్కింది.