IPL Auction 2022: ఐపీఎల్ చరిత్రలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ రికార్డ్.. కాసుల వర్షం కురిసింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) మెగా వేలంలో, ఈసారి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లపై కాసుల వర్షం కురుస్తోంది.

Avesh Khan
IPL Auction 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) మెగా వేలంలో, ఈసారి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లపై కాసుల వర్షం కురుస్తోంది. అనుకున్నదానికంటే చాలా రెట్లు ఎక్కువ డబ్బు చెల్లించి ఆటగాళ్లను కొనుగోలు చేస్తున్నాయి ప్రాంఛైజ్‌లు. ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు బద్దలు కొట్టాడు.
అవేష్ ఖాన్ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్:
అవేశ్ ఖాన్‌ను లక్నో రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఎక్కువ రేటుకు అమ్ముడైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు గౌతమ్ పేరిట ఈ రికార్డు ఉండేది. గత సీజన్ వేలంలో గౌతమ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 9.25 కోట్లకు కొనుగోలు చేసుకుంది.
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లపై కాసుల వర్షం:
షారుక్ ఖాన్ (భారతదేశం) – పంజాబ్ కింగ్స్ రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది.
రాహుల్ తివాటియా(భారతదేశం) – గుజరాత్ రూ. 9 కోట్లకు కొనుక్కొంది
రాహుల్ త్రిపాఠి(భారతదేశం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 8.50 కోట్లకు..
శివమ్ మావి (భారతదేశం) – కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 7.25 కోట్లకు కొనుగోలు చేసింది.
అభిషేక్ శర్మ (భారతదేశం)- సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.6.50 కోట్లకు..
రియాన్ పరాగ్ (భారతదేశం) – రూ. 3.80 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
డెవోల్డ్ బ్రెవిస్ (దక్షిణాఫ్రికా) – ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్లకు..
అభినవ్ మనోహర్ (భారతదేశం) – రూ. 2.60 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.