Womens T20 World Cup 2023 : ఆరోస్సారి.. వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియా, ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం
సౌతాఫ్రికాలో జరిగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అమ్మాయిలు అదరగొట్టారు. వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. తద్వారా క్రికెట్ లో ఆస్ట్రేలియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ అమ్మాయిలు 19 పరుగుల తేడాతో నెగ్గారు.

Womens T20 World Cup 2023 : సౌతాఫ్రికాలో జరిగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అమ్మాయిలు అదరగొట్టారు. వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. తద్వారా క్రికెట్ లో ఆస్ట్రేలియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ అమ్మాయిలు 19 పరుగుల తేడాతో నెగ్గారు.
కేప్ టౌన్ లో జరిగిన టైటిల్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో సఫారీలు 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసి ఓటమిపాలయ్యారు.
ఓపెనర్ లారా ఓల్వార్ట్ 61 పరుగులు చేయగా, క్లో ట్రయోన్ 25 పరుగులు చేసింది. ఓల్వార్ట్ ఔటయ్యాక దక్షిణాఫ్రికా స్కోరు మందగించింది. ఫైనల్ మ్యాచ్ లో 74 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది. ఆసీస్ ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కైవసం చేసుకుంది.
కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు ఆసీస్ బ్యాటింగ్ లైనప్ ను సమర్థంగా కట్టడి చేశారు. భారీ స్కోరు సాధించకుండా నిలువరించారు. షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజానే కాప్ తలో రెండు వికెట్లు తీశారు. ఎంలబా, క్లో ట్రయోన్ చెరో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ బెత్ మూనీ హాఫ్ సెంచరీతో అదగొట్టింది. 53 బంతుల్లో 74 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. ఆష్లే గార్డనర్ 29, వికెట్ కీపర్ అలిస్సా హీలీ 18 పరుగులు చేశారు.
Also Read..Harmanpreet Kaur Cries: ఓటమి బాధతో హర్మన్‌ప్రీత్ కన్నీటిపర్యంతం.. ఓదార్చిన మాజీ కెప్టెన్
గత టీ20 వరల్డ్ కప్ లోనూ ఆస్ట్రేలియా అమ్మాయిలే విజేతలుగా నిలిచారు. తాజా విజయంతో టైటిల్ నిలబెట్టుకున్నారు. ఓవరాల్ గా ఆసీస్ మహిళల జట్టుకు ఇది 6వ టీ20 ప్రపంచకప్. 2010, 2012, 2014, 2018, 2020లో టీ20 వరల్డ్ కప్ లను ఆసీస్ సాధించింది.