Womens T20 World Cup: ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్‌.. ఏ సంవత్సరం ఏ జట్టు విజేతగా నిలిచిందో తెలుసా?

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఏడు సార్లు జరిగింది. ఈ ఏడు సార్లలో ఆస్ట్రేలియా జట్టు అత్యధిక సార్లు కప్‌ను కైవసం చేసుకుంది.

Womens T20 World Cup: ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్‌.. ఏ సంవత్సరం ఏ జట్టు విజేతగా నిలిచిందో తెలుసా?

Womans T20 World cup

Womens T20 World Cup: ఐసీసీ మహిళ టీ20 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరుగుతుంది. ఆతిధ్య జట్టు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ రోజు ఫైనల్ మ్యాచ్‌లోఇరు జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఈ మ్యాచ్ సాయంత్రం 6:30 గంటలకు కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్‌లో జరుగుతుంది. ఇప్పటి వరకు ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఏడు సార్లు జరిగింది. ఈ ఏడు సార్లలో ఆస్ట్రేలియా జట్టు అత్యధిక సార్లు కప్‌ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్టు ఒక్కోసారి ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ ను‌ గెలుచుకున్నాయి. భారత్ మహిళల జట్టు ఇప్పటి వరకు ఒక్కసారికూడా ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలవలేదు.

Ind Vs Aus Womens T20 World Cup : వరల్డ్‌కప్‌లో ముగిసిన భారత్ పోరాటం, ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

♦   ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ టోర్నీ తొలిసారిగా 2009 సంవత్సరంలో జరిగింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది.

♦   2010 సంవత్సరంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

♦   2012 సంవత్సరంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్స్‌లో తలపడగా.. ఆసీస్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీని కైవసంచేసుకుంది.

♦   2014 సంవత్సరంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్‌‌లో తలపడగా ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

♦   2016 సంవత్సరంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. వెస్టిండీస్ జట్టు టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసంచేసుకుంది.

♦   2018 సంవత్సరంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి కప్ ను కైవసంచేసుకుంది.

♦   2020 సంవత్సరంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగ్గా.. ఆసీస్ 85 పరుగుల తేడాతో విజయం సాధించింది.

♦   2023లో దక్షిణాఫ్రికా వేదికగా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో ఆతిధ్య జట్టు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.