Pakistan captain Babar Azam: భారత్‌లో పాక్ జట్టుకు లభించిన ఆదరణపై బాబర్ అజామ్ కీలక వ్యాఖ్యలు.. ఇక్కడి పిచ్ ల గురించి ఏమన్నాడంటే?

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈనెల 14న తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని 1,32,000 మంది వీక్షించే వీలుగా సామర్థ్యం కలిగిన స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

Pakistan captain Babar Azam: భారత్‌లో పాక్ జట్టుకు లభించిన ఆదరణపై బాబర్ అజామ్ కీలక వ్యాఖ్యలు.. ఇక్కడి పిచ్ ల గురించి ఏమన్నాడంటే?

Pakistan captain Babar Azam

Updated On : October 5, 2023 / 10:40 AM IST

ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ 2023 షురూ అయింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. ఇందుకోసం పది నగరాల్లోని మైదానాలు సిద్ధమయ్యాయి. అయితే, హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మినహా అన్ని మైదానాల్లో టీమిండియా ఆడనుంది. ఉప్పల్ స్టేడియంలో మొత్తం మూడు మ్యాచ్ లు జరగనుండగా.. అందులో పాకిస్థాన్ రెండు మ్యాచ్ లు ఆడుతుంది. అయితే, ఇటీవలే పాకిస్థాన్ జట్టు హైదరాబాద్ కు చేరుకుంది. ఈ క్రమంలో ఇక్కడి ఆతిథ్యాన్ని చూసి పాక్ క్రికెట్లు ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా పాక్ కెప్టన్ బాబర్ అజామ్ భారత్‌లో పాక్ జట్టుకు లభిస్తున్న ఆదరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also : ODI World Cup 2023 : భారత్ గడ్డపై క్రికెట్ పండుగ షురూ.. వార్ కు సిద్ధమైన పది జట్లు.. మెగా టోర్నీలో ముఖ్యమైన విశేషాలు ఇవే..

రెండు సన్నాహక మ్యాచ్ ల అనంతరం వన్డే వరల్డ్ కప్ 2023లో శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నెదర్లాండ్ జట్టుతో పాకిస్థాన్ తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, ఇండియాలో లభించిన ఆతిథ్యంపై బాబర్ అజామ్ మాట్లాడారు. భారత్‌లో తమ జట్టు సభ్యులకు లభించిన ఆదరణను ఊహించలేదు. మేము ఇంట్లో ఉన్నట్లే ఉందని పేర్కొన్నారు. మేము హైదరాబాద్ లో దిగిన క్షణం, విమానాశ్రయం నుండి హోటల్ కు, వార్మప్ మ్యాచ్ మైదానం వద్ద ప్రజలు మమ్మల్ని స్వాగతించిన తీరు మాకు మంచి అనుభూతిని కలిగించిందని అజమ్ చెప్పారు. ఇదిలాఉంటే.. భారతదేశంలో పాకిస్థాన్ రాక వీసాల సమస్యపై చాలా ఊహాగానాలకు దారితీసింది. వాటిలో కొన్నింటిని కొంత మంది జర్నలిస్టులతో క్రమబద్దీకరించారు. అంతేకాక మరికొందరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. సరిహద్దు దాటి అభిమానులు వచ్చే అవకాశం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. అయితే బాబర్ ఈ అంశంపై మాట్లాడుతూ. మా వైపు నుండి మాకు అభిమానులు ఉంటే బాగుండేది. ప్రతి మ్యాచ్ లో, ప్రతి స్టేడియంలో అలాంటి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాము. కాబట్టి దానికోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు.

Read Also : ODI rankings : మొద‌టి ర్యాంకుతో వన్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అడుగుపెడుతున్న సిరాజ్‌.. ఒక్క‌డే కాదు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడం వల్ల ప్రపంచ కప్ లో చాలా మంది ప్లేయర్స్ కు భారత్ పిచ్ లపై అవగాహన ఉంది. అయితే, పాకిస్థాన్ ఆటగాళ్లుపై ఐపీఎల్ లో నిషేధం ఉంది. దీనికితోడు పాకిస్థాన్ చివరి సారిగా 2016 టీ20 ప్రపంచ కప్ కోసం భారతదేశంలో పర్యటించింది. పాక్ జట్టులోని అధిక శాతం మంది ఆటగాళ్లకు భారత్ పర్యటన ఇదే తొలిసారి. ఈ క్రమంలో భారత్ పిచ్ లపై వీరి ఆటతీరు ఎలా ఉంటుందనే విషయంపై బాబర్ అజామ్ స్పందించారు. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. భారత్‌లోని పరిస్థితులు పాకిస్థాన్, ఇతర ఆసియా దేశాల్లోని మాదిరిగానే ఉన్నాయని అన్నారు. ఇక్కడ బౌండరీలు తక్కువగా ఉన్నాయని అన్నారు. షాహీన్ షా ఆఫ్రిది నేతృత్వంలోని తమ జట్టు బౌలింగ్ విభాగంలో బలంగా ఉందని అజామ్ చెప్పారు.

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈనెల 14న తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని 1,32,000 మంది వీక్షించే వీలుగా సామర్థ్యం కలిగిన స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్సే కాదు.. ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత్ జట్టుపై పాకిస్థాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా విజయం సాధించలేదు. 14న జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా..? భారత్ జట్టు హవా అలానే కొనసాగుతుందా అనేది తేలనుంది.