Saina Nehwal: సైనా నెహ్వాల్, కశ్యప్.. మళ్లీ కలిసిపోయారు..! అలా ప్రకటించి నెల తిరక్కముందే.. వైరల్ గా మారిన ఇన్ స్టా పోస్ట్..
జీవితం కొన్నిసార్లు మనల్ని విభిన్న మార్గంలోకి తీసుకెళ్తుంది. సుదీర్ఘ చర్చలు, ఎన్నో ఆలోచనల తర్వాత నేను..

Saina Nehwal: భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్ (35), పారుపల్లి కశ్యప్ మళ్లీ కలిసిపోయారా? వీరిద్దరూ తిరిగి ఒక్కటవ్వనున్నారా? విడిపోవాలని తీసుకున్న నిర్ణయం మార్చుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. సైనా నెహ్వాల్ రీసెంట్ గా తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తన భర్త పారుపల్లి కశ్యప్ తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న సైనా.. ‘‘దూరం దగ్గర చేసింది’’ అనే క్యాప్షన్ జత చేసింది. అలా తాము తిరిగి ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని సంకేతాలిచ్చింది సైనా.
కశ్యప్ తో కలిసున్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసిన సైనా.. కొన్నిసార్లు దూరమే.. సన్నిహితుల విలువ తెలియజేస్తుంది అనే అర్థం వచ్చేలా ఆమె రాసుకొచ్చారు. దీంతో సైనా, కశ్యప్ తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
కశ్యప్, తాను విడిపోతున్నట్లు సైనా నైహ్వాల్ గత నెల 13న సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా చర్చించాకే తామీ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించింది. ‘‘జీవితం కొన్నిసార్లు మనల్ని విభిన్న మార్గంలోకి తీసుకెళ్తుంది. సుదీర్ఘ చర్చలు, ఎన్నో ఆలోచనల తర్వాత నేను, కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ప్రశాంతతను ఎంచుకున్నాం. ఈ సమయంలో మా గోప్యతకు గౌరవం ఇస్తారని భావిస్తున్నాం’’ అని సైనా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అలా.. సైనా కశ్యప్ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికినట్లైంది. పరస్పర అంగీకారంతోనే తామిద్దరం విడిపోయినట్లు సైనా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తాము విడిపోతున్నట్లు ప్రకటించిన నెల రోజుల లోపే.. సైనా నెహ్వాల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. భర్త కశ్యప్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టా లో షేర్ చేసింది. ‘‘కొన్నిసార్లు దూరమే.. మన సన్నిహితులతో కలిసి ఉండటం ఎంత విలువైనదో నేర్పుతుంది. మేము కలిసి ఉండేందుకు మరో ప్రయత్నం చేస్తున్నాం’’ అని రెండు హార్ట్ ఎమోజీలతో క్యాప్షన్ ను జత చేసింది సైనా. దీంతో మళ్లీ ఇద్దరూ కలిసిపోయారా అనే చర్చ మొదలైంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. సైనా, కశ్యప్ లవర్స్. ఆరేళ్లు ప్రేమించుకున్నారు. 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందారు. తాజాగా సైనా, కశ్యప్ లు తిరిగి ఒక్కటవ్వనున్నారనే సంకేతాలు అభిమానుల్లో సంతోషం నింపాయి.
View this post on Instagram
Also Read: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కుక్కలు.. ప్రయాణీకుల కోసం స్పెషల్ ప్రోగ్రామ్.. లాభాలు ఏంటంటే..