Mushfiqur Rahim: టెస్ట్‌లు, వన్డేలపై ఫోకస్ పెట్టేందుకు..! టీ20లకు గుడ్‌బై చెప్పిన బంగ్లాదేశ్ క్రికెటర్

బంగ్లాదేశ్ జట్టులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం టీ20 క్రికెట్ కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు ఆదివారం తన ట్విటర్ ఖాతాలో ప్రకటించారు. కేవలం అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నానని, ఫ్రాంచైజీ క్రికెట్ కు అందుబాటులో ఉంటానంటూ ముష్ఫికర్ రహీం స్పష్టం చేశాడు.

Mushfiqur Rahim: టెస్ట్‌లు, వన్డేలపై ఫోకస్ పెట్టేందుకు..! టీ20లకు గుడ్‌బై చెప్పిన బంగ్లాదేశ్ క్రికెటర్

Bangladesh cricketer Mushfiqur Rahim

Updated On : September 4, 2022 / 2:17 PM IST

Mushfiqur Rahim: బంగ్లాదేశ్ జట్టులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం టీ20 క్రికెట్ కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు ఆదివారం తన ట్విటర్ ఖాతాలో ప్రకటించారు. టెస్టులు, వన్డేలపై ఫోకస్ పెట్టేందుకు టీ20ల నుంచి వైదొలుగుతున్నట్లు రహీం వెల్లడించారు. అయితే కేవలం అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నానని, ఫ్రాంచైజీ క్రికెట్ కు అందుబాటులో ఉంటానంటూ ముష్ఫికర్ రహీం స్పష్టం చేశాడు.

Asia Cup 2022: భారత్ జోరు కొనసాగేనా..! నేడు పాకిస్థాన్‌తో భారత్ ఢీ.. వారు రాణిస్తే భారత్‌ విజయం సునాయాసం ..

ప్రస్తుతం ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ జట్టు పేలువ ప్రదర్శన కనబర్చి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలు రహీం ఆశించిన స్థాయిలో రాణించలేదు. బ్యాటింగ్ విఫలమయ్యాడు. అంతేకాక శ్రీలంకతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో కీలక సమయంలో క్యాచ్ ను జారవిడిచాడు. వరుస పరాజయాలతో డీలాపడ్డ జట్టుకు 35ఏళ్ల ముష్పికర్ గుడ్‌బై చెప్పడం ఆ జట్టుకు దెబ్బే అని చెప్పొచ్చు.

ముష్ఫికర్ రహీం బంగ్లాదేశ్ జట్టు తరపున 82 టెస్ట్‌ల్లో తొమ్మిది సెంచరీలు, 25 హాఫ్‌ సెంచరీల సాయంతో 5235 పరుగులు చేశాడు. 236 వన్డేల్లో ఎనిమిది సెంచరీలు, 42 హాఫ్‌ సెంచరీల సాయంతో 6774 పరుగులు చేశాడు. 102 టీ20 మ్యాచ్ లు ఆడిన రహీం.. 115 స్ట్రయిక్‌ రేట్‌తో ఆరు హాఫ్‌ సెంచరీల సాయంతో 1500 పరుగులు సాధించాడు.