IND vs BAN : టెస్టుల్లో ఓడిపోవచ్చు గానీ.. టీ20 సిరీస్ మాదే.. దూకుడుగా ఆడి ఇండియాకు చెక్ పెడతాం : బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో
ఓటమిని పక్కన బెట్టి ప్రస్తుతం టీ20 సిరీస్ కోసం సన్నద్ధం అవుతోంది బంగ్లాదేశ్.

Bangladesh will look to win T20I series vs India Najmul Hossain Shanto
IND vs BAN : భారత్‌తో జరిగిన రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 0-2 తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమిని పక్కన బెట్టి ప్రస్తుతం టీ20 సిరీస్ కోసం సన్నద్ధం అవుతోంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తొలి టీ20 మ్యాచులో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో మాట్లాడాడు.
టెస్టు సిరీస్‌లో ఓడినప్పటికి టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంటామన్న ధీమాను శాంటో వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌కు అన్ని విధాలుగా సన్నద్ధం అయినట్లు తెలిపాడు. దూకుడైన ఆటతీరు కనబరుస్తామని చెప్పాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరుకునేందుకు మాకు అద్భుత అవకాశం లభించింది. అయితే. దురదృష్టవశాత్తు మేము సెమీస్ చేరుకోలేకపోయాము.
ప్రస్తుత జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారని అన్నాడు. వాళ్లంతా భారత్ పై సత్తా చాటాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. టెస్టుల్లో మేము మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఆ విషయం మాకు తెలుసు. కానీ టీ20 క్రికెట్ చాలా భిన్నం. ఆ రోజు ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారు. గత ప్రదర్శనలతో సంబంధం ఉండదు అని శాంటో అన్నాడు.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్ షెడ్యూల్..
* తొలి టీ20 మ్యాచ్ – అక్టోబర్ 6న గ్వాలియర్‌లో
* రెండో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 9న ఢిల్లీలో
* మూడో టీ20 మ్యాచ్ – అక్టోబర్ 12న హైదరాబాద్‌లో