BCCI Awards 2024 : హైదరాబాద్‌లో అట్టహాసంగా బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్.. అవార్డులు అందుకున్న క్రికెటర్లు వీరే

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవార్డుల‌ కార్య‌క్ర‌మం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన పురుషుల, మహిళల జట్ల క్రీడాకారులకు అవార్డులను అందజేశారు.

BCCI Awards 2024 : హైదరాబాద్‌లో అట్టహాసంగా బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్.. అవార్డులు అందుకున్న క్రికెటర్లు వీరే

BCCI Awards

BCCI Awards Ceremony 2024:  భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవార్డుల‌ కార్య‌క్ర‌మం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఓ స్టార్ హోటల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు అవార్డులను అందజేశారు. కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా హైదరాబాద్ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో గత నాలుగేళ్లకు సంబంధించిన అవార్డులను భారత్ క్రికెట్ పురుషులు, మహిళల జట్లకు అందజేశారు. భార‌త క్రికెట‌ర్ల‌తో పాటు దేశ‌వాళీ ఆట‌గాళ్లు, బీసీసీఐ పెద్ద‌లు ఈ వేడుక‌కు హాజ‌రు కాగా హ‌ర్షా భోగ్లే వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

Also Read : BCCI Awards : రవిశాస్త్రికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.. భావోద్వేగానికి లోనైన మాజీ కోచ్‌

అవార్డులు అందుకున్న వారు వీరే..

  • కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ వార్డు (పురుషులు) : ఫరోఖ్ ఇంజనీర్, రవిశాస్త్రి
  • పాలీ ఉమ్రిగర్ అవార్డు – ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ (పురుషులు) : మహ్మద్ షమీ (2019-2020), రవిచంద్ర అశ్విన్ (2020-21), జస్ర్పిత్ బుమ్రా (2021- 22), శుభ్‌మన్ గిల్ (2022-23)
  • ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (మహిళలు) : దీప్తి శర్మ (2019 -20, 2022-23), స్మృతి మంధాన (2020 -21, 2021-22).
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగ్రేటం (పురుషులు) : మయాంక్ అగర్వాల్ (2019-20), అక్షర్ పటేల్ (2020-21), శ్రేయాస్ అయ్యర్ (2021-22), యశస్వీ జైస్వాల్ (2022-23).
  • ఉత్తమ అంతర్జాతీయ అరంగ్రేటం (మహిళలు) : ప్రియా పునియా (2019-20), షఫాలీ వర్మ (2020-21, సబ్భినేని మేఘన (2021-22), అమంజోత్ కౌర్ (2022-23)
  • దిలీప్ సర్దేశాయ్ అవార్డు – టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు : యశస్వీ జైస్వాల్ (2022-23)
  • దిలీప్ సర్దేశాయ్ అవార్డు – టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు : రవిచంద్రన్ అశ్విన్ (2022-23)
  • వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారు (మహిళలు) : పూనమ్ రౌత్ (2019-20), మిథాలీ రాజ్ (2020-21), హర్మన్ ప్రీత్ కౌర్ (2021-22), జెమిమా రోడ్రిగ్స్ (2022-23).
  • వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన (మహిళలు) : పూనమ్ యాదవ్ (2019-20), ఝలన్ గోస్వామి (2020-21), రాజేశ్వరి గయక్వాడ్ (2021-22), దేవికా వైద్య (2022-23).
  • దేశీయ క్రికెట్ లో ఉత్తమ అంపైర్ : ఎ. పద్మనాభన్ (2019-20), బృందా రాఠి (2020-21), జయరామన్ మదగోపాల్ (2021-22), రోహన్ పండిట్ (2022-23).
  • బీసీసీఐ దేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన : ముంబై (2019-20), మధ్యప్రదేశ్ (2021-22), సౌరాష్ట్ర (2022-23).
  • లాలా అమర్ నాథ్ అవార్డు – రంజీట్రోపీలో బెస్ట్ ఆల్ రౌండర్ : ఎంబీ మురాసింగ్ (2019-20), షామ్స్ ములానీ (2021-22), శరన్ష్ జైన్ (2022-23).
  • లాలా అమర్ నాథ్ అవార్డు – దేశీయ పరిమిత ఓవర్లలో ఉత్తమ ఆల్ రౌండర్ : బాబా అపరాజిత్ (2019-2020), ఆర్ఆర్ ధావన్ (2020-21, 2021-22), రియాన్ పరాగ్ (2022-23).
  • మాధవరావు సింధియా అవార్డ్ – రంజీ ట్రోపీలో అత్యధిక పరగులు సాధించిన ప్లేయర్ : రాహుల్ దలాల్ (2019-20), సర్ఫరాజ్ ఖాన్ (2021-22), మయాంక్ అగర్వాల్ (2022-23).
  • ఎంఏ చిదంబరం ట్రోఫీ- యూ19 కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ : పి కాన్పిల్లెవార్ (2019-20), మయాంక్ శాండిల్య(2021-22), డానిష్ మాలెవార్ (2022-23).
  • MA చిదంబరం ట్రోఫీ – U-19 కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు : హర్ష్ దూబే (2019-20), ఏఆర్ నిషాద్ (2021-22), మానవ్ చోటాని (2022-23).
  • జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ – బెస్ట్ ఉమెన్ క్రికెటర్ సీనియర్ డొమెస్టిక్ : సాయి పురందరే (2019-20), ఇంద్రాణి రాయ్ (2020-21), కనికా అహుజా (2021-22), నబమ్ యాపు (2022-23).
  • జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ – బెస్ట్ ఉమెన్ క్రికెటర్ జూనియర్ డొమెస్టిక్ : కష్వీ గౌతమ్ (2019-20), సౌమ్య తివారీ (2021-22), వైష్ణవి శర్మ (2022-23)