BCCI Awards : రవిశాస్త్రికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.. భావోద్వేగానికి లోనైన మాజీ కోచ్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవార్డుల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

Ravi Shastri emotional after receiving BCCI Lifetime Achievement Award
BCCI Awards – Ravi Shastri : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవార్డుల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దాదాపు నాలుగేళ్ల తరువాత బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత క్రికెటర్లతో పాటు దేశవాళీ ఆటగాళ్లు, బీసీసీఐ పెద్దలు ఈ వేడుకకు హాజరు కాగా హర్షా భోగ్లే వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరిని ఆటగాళ్లకు పాలీ ఉమ్రిగర్ అవార్డును ప్రధానం చేశారు. 2022-23గాను పాలీ ఉమ్రిగర్ ఉత్తమ క్రికెటర్‌గా శుభ్‌మన్ గిల్, 2020-21కి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, 2019-20కి పేసర్ మహ్మద్ షమీ, 2021-22కి బుమ్రా లు అందుకున్నారు. ఉత్తమ మహిళా ప్లేయర్‌గా 2020-21, 2021-22కి గాను స్మృతి మంధాన, 2019-20, 2022-23గాను దీప్తి శర్మలు ఈ అవార్డులను గెలుచుకున్నారు. కాగా.. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి.
రవిశాస్త్రికి సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
భారత మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా అతడికి ఈ అవార్డును ప్రధానం చేశారు. రవిశాస్త్రితో పాటు ఫరూక్ ఇంజనీర్ కూడా ఈ అవార్డును అందుకున్నారు.
Jasprit Bumrah : ఇంగ్లాండ్ బజ్‌బాల్ గేమ్ ఆడితే.. నాకు చాలా లాభం : బుమ్రా
?️?️ ??’? ? ???? ???????? ?????? ??? ??@RaviShastriOfc on winning the Col. C.K. Nayudu Lifetime Achievement Award ??#NamanAwards pic.twitter.com/WHCpKHo3SJ
— BCCI (@BCCI) January 23, 2024
ఈ అవార్డును అందుకున్న క్రమంలో రవిశాస్త్రి భావోద్వేగానికి లోనయ్యాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గౌరవంగా ఉందన్నాడు. క్రికెటర్‌గా తన ప్రయాణం, కోచ్‌గా తన పదవి కాలంలో సాధించిన విజయాలు, కామెంటేటర్‌గా చూసిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నాడు. 1985 మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్, 1983లో టీమ్ఇండియా తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను అందుకోవడం, 2007లో T20 ప్రపంచ కప్ విజయం, 2011లో ఎంఎస్ ధోని సిక్సర్‌తో గెలిపించడం వంటి విజయాలను జ్ఞాపకం చేసుకున్నాడు.
ఇక తన దృష్టిలో అత్యంత విలువైన గెలుపు ఏది అంటే.. గబ్బా టెస్టు మ్యాచులో రిషబ్ పంత్ విన్నింగ్ షాట్ అని చెప్పాడు. చారిత్రక గబ్బా టెస్టులో భారత్ విజయం సాధించిన సందర్భంలో రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సంగతి తెలిసిందే.