ప్లే‌ఆఫ్‌లకు బీసీసీఐ టార్గెట్ రూ.20కోట్లు

ప్లే‌ఆఫ్‌లకు బీసీసీఐ టార్గెట్ రూ.20కోట్లు

Updated On : May 2, 2019 / 8:12 AM IST

ప్రపంచ దేశాల్లోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ సంవత్సరం లీగ్ దశను దాటిపోయింది. ఇంకొద్ది రోజుల్లోనే ప్లే ఆఫ్‌లకు అడుగుపెడుతున్న ఐపీఎల్ మీద బీసీసీఐ భారీ అంచనాలే పెట్టుకుంది. ఈ ప్లేఆఫ్‌ల కోసం స్టేడియంకు వచ్చే అభిమానుల నుంచే రూ.20కోట్లు రాబట్టాలని యోచిస్తోంది. 

ఐపీఎల్ నియమావళి ప్రకారం.. గ్రూప్ దశలో వచ్చే ఆధాయం ఫ్రాంచైజీల ఖాతాలోకి చేరతాయి. ఫైనల్‌కు ముందు జరిగే 4మ్యాచ్‌ల నుంచే నిధులు మాత్రం బీసీసీఐకే చెందుతాయి. ఈ క్రమంలోనే గతేడాది సంపాదించిన దాని కంటే రూ.2కోట్లు ఎక్కువ రాబట్టాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది. 

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిరాకరించిన తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సొంత స్టేడియంలో నిర్వహించాలని ముందుగా అనుకున్నా.. మే 7న జరగాల్సి ఉన్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌ను మాత్రమే చెన్నై వేదికగా నిర్వహించనున్నారు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లు వైజాగ్ వేదికగా జరగనున్నాయి. 

ఫైనల్ వేదికగా ఉప్పల్:
ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్‌కు వేదిక కానుంది. డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వేదికగా చెన్నై స్టేడియాన్ని నిరాకరించడంతో హైదరాబాద్ ఆ అవకాశాన్ని దక్కించుకుంది.