PM Modi-Team India : ప్రధాని మోదీకి టీమ్‌ఇండియా ‘జెర్సీ’.. నంబర్ ఎంతో ఎంతంటే?

ప్లేయ‌ర్ల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా క‌లిసి అభినందించారు.

PM Modi-Team India : ప్రధాని మోదీకి టీమ్‌ఇండియా ‘జెర్సీ’.. నంబర్ ఎంతో ఎంతంటే?

BCCI Gift PM Special NaMo World Cup Champions Jersey

PM Modi-Team India : ఫైన‌ల్ మ్యాచులో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును చిత్తు చేసి విశ్వ విజేత‌గా నిలిచింది టీమ్ఇండియా. చాన్నాళ్ల త‌రువాత మ‌రోసారి టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన నాలుగు రోజుల త‌రువాత భార‌త జ‌ట్టు స్వ‌దేశానికి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ప్లేయ‌ర్ల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేకంగా క‌లిసి అభినందించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ప్ర‌ధాన కోచ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన రాహుల్ ద్ర‌విడ్ పై ప్ర‌శంస‌లు కురిపించారు.

భారత ప్లేయ‌ర్ల‌తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులతో ప్ర‌ధాని కాసేపు ముచ్చ‌టించారు. వాళ్లతో కలిసి అల్పాహారం చేశారు. ఇక‌ బుమ్రా కుమారుడిని మోదీ ఎత్తుకుని ఆడించడం విశేషం. భార‌త క్రికెట‌ర్ల‌తో పాటు బీసీసీఐ అధ్య‌క్షుడు రోజ‌ర్ బిన్నీ, కార్య‌ద‌ర్శి జై షా లు కూడా ప్ర‌ధానిని క‌లిశారు.

Mahmudullah : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓట‌మి.. మ‌రో స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ క్రికెట్‌కు వీడ్కోలు..

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీకి వీరిద్ద‌రు ప్ర‌త్యేకంగా భార‌త జెర్సీని అంద‌జేశారు. నరేంద్రలోని మొదటి రెండు లెటర్స్ ‘NA’ను, అలాగే మోదీలో తొలి రెండు అక్షరాలను ‘MO’ని తీసుకుని నమో (NAMO) పేరు జెర్సీ వెనుక రాసి ఉంది. అలాగే 1వ నంబ‌ర్‌ను కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను బీసీసీఐ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

‘ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌ల‌ను ప్ర‌ధాని మోదీ క‌లిశారు. మీ (ప్ర‌ధాని) స్ఫూర్తిదాయకమైన మాటలు, భార‌త జ‌ట్టుకు మీరు అందించిన అమూల్యమైన మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు.’ అంటూ బీసీసీఐ రాసుకొచ్చింది.

Rishabh Pant : చాలు చాలు లే.. మా ద‌గ్గ‌ర ఉంది లేవోయ్‌.. పంత్‌ను ట్రోల్ చేసిన అక్ష‌ర్‌, సిరాజ్‌..

గొప్ప గౌర‌వం విరాట్..

ప్ర‌ధాని మోదీతో భేటీ త‌రువాత టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానిని క‌ల‌వ‌డం గొప్ప గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు చెప్పాడు. ఆహ్వానించినందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.

Pakistan cricketers : మీ దుంప‌లు తెగ‌.. ఓ దుప్ప‌టి, దిండు కూడా తెచ్చుకోక‌పోయారా..? ప‌రుపుల‌పై పాక్ ఆటగాళ్ల క్యాచింగ్ ప్రాక్టీస్‌..