నోటిదూల కదా : హర్దీక్, రాహుల్ పై బ్యాన్!

భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్య, కెఎల్ రాహుల్ కు మరో షాక్ తగలనుంది. వీరిద్దరికి రెండు వన్డేల మ్యాచ్ లపై బీసీసీఐ నిషేధం విధించనుంది.

  • Published By: sreehari ,Published On : January 10, 2019 / 10:22 AM IST
నోటిదూల కదా : హర్దీక్, రాహుల్ పై బ్యాన్!

Updated On : January 10, 2019 / 10:22 AM IST

భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్య, కెఎల్ రాహుల్ కు మరో షాక్ తగలనుంది. వీరిద్దరికి రెండు వన్డేల మ్యాచ్ లపై బీసీసీఐ నిషేధం విధించనుంది.

భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్య, కెఎల్ రాహుల్ కు మరో షాక్ తగలనుంది. వీరిద్దరికి రెండు వన్డేల మ్యాచ్ లపై బీసీసీఐ నిషేధం విధించనుంది. కాఫీ విత్ కరన్ హిందీ టీవీ షోలో మహిళలను కించపరిచేలా హర్దీక్ పాండ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ వీరిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ హర్దీక్ పాండ్య, రాహుల్ కు రెండు మ్యాచ్ ల్లో నిషేధం విధించాలని సీఓఏ సభ్యులు డయానా ఎడుల్జీకి సిఫార్స్ చేశారు. 

బీసీసీఐ షోకాజ్ నోటీసులపై స్పందించిన పాండ్య… తన వివరణ ఇచ్చుకున్నప్పటికీ సీఓఏ సంతృప్తి చెందలేదు. దీంతో పాండ్య, రాహుల్ కు రెండు మ్యాచ్ ల్లో సస్పెన్షన్ విధించాలని సీఓఏకు సిఫార్స్ చేసినట్టు ఆయన చెప్పారు. ‘‘హర్దీక్ వివరణతో నేను సంతృప్తి చెందలేదు. రాహుల్ సహా పాండ్యపై రెండు మ్యాచ్ నిషేధం విధించాలని సిఫార్స్ చేశా. సీఓఏ సభ్యులు డయానాదే తుది నిర్ణయం. వీరిద్దరిపై నిషేధం విషయమై త్వరలో ఆమె తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఏదిఏమైనా పాండ్య వ్యాఖ్యలు సరికావు. క్షమించరానిది’’ అని రాయ్ అభిప్రాయపడ్డారు.