ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఏకగ్రీవంగా ఎన్నిక
ఈ ఏడాది డిసెంబర్ 1న జైషా బాధ్యతలు స్వీకరిస్తారని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయ క్రికెట్ మండలి-ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 1న జైషా బాధ్యతలు స్వీకరిస్తారని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్క్‌లే ఉన్నారు.
అయితే, తాను మరోసారి మళ్లీ ఆ పదవిలో ఉండాలనుకోవట్లేదని ఆగస్ట్ 20న గ్రెగ్ బార్క్‌లే ప్రకటించారు. ఆయన పదవీ కాలం నవంబర్‌లో ముగియనుంది. క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రజాదరణను తీసుకొచ్చేలా కృషి చేస్తానని షా కొన్ని రోజుల క్రితం అన్నారు.
ఐసీసీ ఛైర్మన్లుగా భారతీయులు
- జగ్మోహన్ దాల్మియా (1997 – 2000)
- శరద్ పవార్ (2010 – 2012)
- ఎన్.శ్రీనివాసన్ (2014 – 2015)
- శశాంక్ మనోహర్ (2015 – 2020)
- జై షా (2024*)
ఐసీసీ ఛైర్మన్ల పూర్తి లిస్ట్
- లార్డ్ కోలిన్ కౌడ్రే 1989 – 1993
- సర్ క్లైడ్ వాల్కాట్ 1993 – 1997
- జగ్మోహన్ దాల్మియా 1997 – 2000
- మాల్కం గ్రే 2000 – 2003
- ఎహ్సాన్ మణి 2003 – 2006
- పెర్సీ సన్ 2006 – 2007
- రే మాలి 2007 – 2008
- డేవిడ్ మోర్గాన్ 2008 – 2010
- శరద్ పవార్ 2010 – 2012
- అలాన్ ఐజాక్ 2012 – 2014
- ముస్తఫా కమల్ 2014 – 2015
- జహీర్ అబ్బాస్ 2015 – 2016
- ఎన్.శ్రీనివాసన్ 2014 – 2015
- శశాంక్ మనోహర్ 2015 – 2020
- గ్రెగ్ బార్క్లే 2020 – 2024
- జై షా 2024*