BCCI To Reject PCBs Delhi Proposal For Champions Trophy Report
Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ టోర్నీకి సంబంధించిన డ్రాప్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి పంపించింది. అయితే.. భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం కష్టం. అయినప్పటికి పాక్‌లోనే మెగాటోర్నీ జరుగుతుందని ఇప్పటికే పలు మార్లు పీసీబీ అధికారులు తెలిపారు.
హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించాలని బీసీసీఐ కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే తప్ప తాము పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Archery World Cup : ఆర్చరీ ప్రపంచకప్.. దీపికా కుమారికి రజతం..
అయితే.. ఓ ప్రతిపాదనను పీసీబీ, బీసీసీఐ ముందు ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. టీమ్ఇండియా తన మ్యాచ్ ముగిసిన తరువాత వెంటనే ఢిల్లీ లేదా ఛండీగడ్‌కు వెళ్లిపోయేలా ప్రతిపాదన చేసిందని ఆ వార్తల సారాంశం. ఇందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయలేదు. ఎట్టిపరిస్థితుల్లో పాక్‌లో అడుగుపెట్టేది లేదని తేల్చి చెప్పినట్లు పేర్కొన్నాయి.
కాగా.. పీసీబీ నుంచి అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని బీసీసీఐ వర్గాలు చెప్పడం గమనార్హం. పాకిస్థాన్‌కు వెళ్లాలా వద్దా అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాయి. ఇంకోవైపు పాకిస్థాన్ సైతం టీమ్ఇండియా తమ దేశంలో అడుగుపెట్టదని మానసికంగా సన్నద్ధమైందని కథనాలు వస్తున్నాయి. దీంతో హైబ్రిడ్ మోడ్‌లో మ్యాచులను నిర్వహించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
గత ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడ్‌లోనే నిర్వహించిన సంగతి తెలిసిందే. భారత్ ఆడే మ్యాచులను పాకిస్థాన్‌లో కాకుండా వేరే దేశంలో నిర్వహిస్తారు.
NZW vs SAW Final: రెండోసారి విఫలమైన సౌతాఫ్రికా.. టీ20 విశ్వ విజేతలుగా న్యూజిలాండ్ అమ్మాయిలు
ఇదిలా ఉంటే.. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది.