BCCI: ఇంగ్లాండ్‌తో టెస్టు ముందుకు జరిపి ఐపీఎల్ 2021 పూర్తి చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుందా..

బోర్డ్ ఫర్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఐపీఎల్ 2021ను ఎలాగైనా పూర్తి చేయాలని భావిస్తుందట. ఈ మేర ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ)కి తమ దేశ జట్టుతో జరగబోయే టెస్టు సిరీస్ ను ముందుకు జరపాలని..

BCCI: బోర్డ్ ఫర్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఐపీఎల్ 2021ను ఎలాగైనా పూర్తి చేయాలని భావిస్తుందట. ఈ మేర ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ)కి తమ దేశ జట్టుతో జరగబోయే టెస్టు సిరీస్ ను ముందుకు జరపాలని అడిగినట్లు సమాచారం. కొన్ని ఫ్రాంచైజీలలో ప్లేయర్లతో పాటు ఇతర స్టాఫ్ కు పాజిటివ్ రావడంతో అర్ధాంతరంగా ఐపీఎల్ వాయిదా వేశారు.

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆగష్టు 4న తొలి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 10 నుంచి 14వరకూ జరిగే చివరి టెస్టుతో సిరీస్ ముగుస్తుంది. దానిని కాస్త ముందుకు జరిపి సెప్టెంబర్ 7కల్లా పూర్తి చేయాలని బీసీసీఐ అనుకుంటుందట.

మూడు వారాల్లో జరిగే 31 మ్యాచ్ లను టార్గెట్ చేసుకుంది బీసీసీఐ. ఆ తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ నెల మధ్య నుంచి నవంబర్ 14వరకూ జరగాల్సి ఉంది. టెస్టు సిరీస్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల మధ్యనే ఐపీఎల్ 2021ను ముగించాలని బీసీసీఐ యోచిస్తోందట.
.

ట్రెండింగ్ వార్తలు