IND vs ENG 3rd Test : బెన్‌డ‌కెట్ శ‌త‌కం.. అశ్విన్ 500 వికెట్లు.. భార‌త్‌కు దీటుగా బ‌దులిస్తున్న ఇంగ్లాండ్‌..

రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు ధీటుగా బ‌దులిస్తోంది.

England Score 207/2 in first innings On Day 2 In Rajkot Test

IND vs ENG : రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు దీటుగా బ‌దులిస్తోంది. మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త్ 445 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 207 ప‌రుగులు చేసింది. బెన్‌డ‌కెట్ (133; 118 బంతుల్లో 21 ఫోర్లు, 2సిక్స‌ర్లు ), జోరూట్ (9) లు క్రీజులో ఉన్నారు. భార‌త స్కోరుకు ఇంగ్లాండ్ ఇంకా 238 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది.

శ‌త‌కంతో చెల‌రేగిన డ‌కెట్‌..
టీమ్ఇండియా ఆలౌటైన త‌రువాత మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌కు శుభారంభం ద‌క్కింది. ఓపెన‌ర్లు జాక్‌క్రాలీ(15), బెన్ డ‌కెట్‌లు తొలి వికెట్‌కు 89 ప‌రుగులు జోడించి అద్భుత ఆరంభాన్నిఇచ్చారు. డ‌కెట్ భార‌త బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగ‌గా క్రాలీ క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. అయితే.. క్రాలీని అశ్విన్ ఔట్ చేయ‌డంతో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్‌కు ఇది టెస్టుల్లో 500వ వికెట్ కావ‌డం విశేషం.

IND vs ENG 3rd Test : అటు చూడు.. అలా ఆడాలి.. నువ్వూ ఉన్నావ్‌..! ఇంగ్లాండ్ అంటేనే చాలు రెచ్చిపోతాడు

క్రాలీ ఔటైనా.. ఓలీపోప్ (39) జ‌త‌గా డ‌కెట్ దూకుడుగా ఆడాడు. ఈ క్ర‌మంలోనే 88 బంతుల్లో శ‌త‌కాన్ని అందుకున్నాడు. డ‌కెట్‌-పోప్ జోడి ప్ర‌మాద‌క‌రంగా మార‌గా మ‌హ్మ‌ద్ సిరాజ్.. పోప్‌ను ఎల్బీగా ఔట్ చేయ‌డంతో ఈ జోడి విడిపోయింది. రెండో వికెట్‌కు పోప్‌-డ‌కెట్ లు 93 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. సెంచ‌రీ త‌రువాత కూడా ఏమాత్రం త‌గ్గని డ‌కెట్‌.. రూట్ తో క‌లిసి మ‌రో వికెట్ ప‌డ‌కుండా రెండో రోజు ఆట‌ను ముగించాడు.

119 ప‌రుగులు 5 వికెట్లు..
అంత‌క‌ముందు ఓవ‌ర్‌నైట్ స్కోరు 326/5 తో రెండో రోజు ఆట‌ను కొన‌సాగించిన భార‌త్ మ‌రో 119 ప‌రుగులు జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ఆరంభ‌మైన కాసేప‌టికే నైట్‌వాచ్‌మ‌న్ కుల్దీప్‌యాద‌వ్ (4)తో పాటు సెంచ‌రీ హీరో జ‌డేజా (112)లు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. ఈ ద‌శ‌లో అరంగ్రేట ఆట‌గాడు ధ్రువ్ జురెల్‌(46), సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ (37) లు ఆచితూచి ఆడారు.

IND vs ENG : సున్నా నుంచి కాదు.. ఐదు ప‌రుగుల‌తో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఇంగ్లాండ్.. ఎందుకో తెలుసా?

ఈ జంట మంచి బంతుల‌ను గౌర‌విస్తూనే చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించారు. వీరిద్ద‌రు ఎనిమిదో వికెట్‌కు 77 ప‌రుగులు జోడించారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో వీరిద్ద‌రు పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. ముందుగా అశ్విన్‌, ఆ త‌రువాత జురెల్‌ను అహ్మ‌ద్ ఔట్ చేశాడు. ఆఖ‌ర్లో జ‌స్‌ప్రీత్ బుమ్రా (26; 28 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్‌) వేగంగా ఆడ‌డంతో భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

ట్రెండింగ్ వార్తలు