IND vs ENG : సున్నా నుంచి కాదు.. ఐదు ప‌రుగుల‌తో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఇంగ్లాండ్.. ఎందుకో తెలుసా?

రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

IND vs ENG : సున్నా నుంచి కాదు.. ఐదు ప‌రుగుల‌తో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఇంగ్లాండ్.. ఎందుకో తెలుసా?

India handed five run penalty for Unfair Play England to start innings with 5/0

IND vs ENG 3rd Test : రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(131), ర‌వీంద్ర జ‌డేజా (112)లు సెంచ‌రీలు చేశారు. యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (62) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో మార్క్‌వుడ్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. రెహాన్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీశాడు. టామ్ హార్డ్లీ, జేమ్స్ అండ‌ర్స‌న్‌, జోరూట్‌లు త‌లా ఓ వికెట్ సాధించారు.

కాగా.. ఈ మ్యాచ్‌లో భార‌త్‌కు పెనాల్టీ ప‌డింది. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం రోహిత్ సేన‌కు ఐదు ప‌రుగుల పెనాల్టీ విధించారు. భార‌త మొద‌టి ఇన్నింగ్స్‌లో 102వ ఓవ‌ర్‌లో ఇది చోటు చేసుకుంది. అంపైర్ జోయ‌ల్ విల్స‌న్ పెనాల్టీ కింద ఇంగ్లాండ్‌కు 5 ప‌రుగులు ఇచ్చాడు. అంపైర్ పెనాల్టీ సిగ్న‌ల్ ఇవ్వ‌డం చూసిన అశ్విన్‌కు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇదే విష‌య‌మై అంపైర్‌తో చ‌ర్చించాడు.

Badminton Asia Team Championships : ప‌త‌కాన్ని ఖాయం చేసుకున్న భార‌త మ‌హిళా ష‌ట్ల‌ర్లు

అశ్విన్ పిచ్ మ‌ధ్య‌లో ప‌రిగెతుడుత‌న్నాడ‌ని అంపైర్ పేర్కొన్నాడు. మ‌రోసారి అలా చేయొద్దు అంటూ అత‌డికి వార్నింగ్ ఇచ్చాడు. ఈక్ర‌మంలో అశ్విన్‌, అంపైర్‌కు మ‌ధ్య కాసేపు వాగ్వాదం జ‌రిగింది. ఈ పెనాల్టీ ప‌రుగులు ఫీల్డింగ్ జ‌ట్టుకు ల‌భిస్తాయి. దీంతో ఇంగ్లాండ్ జ‌ట్టు త‌న ఇన్నింగ్స్‌ను 5/0తో మొద‌లు పెట్టింది.

సాధార‌ణంగా ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆట‌గాళ్ల‌కు అంపైర్ తొలుత వార్నింగ్ ఇస్తాడు. మ‌రోసారి ఇదే ప‌రిస్థితి పునార‌వృతం అయితే అప్పుడు పెనాల్టీ విధిస్తారు. తొలి రోజు ఆట‌లో ర‌వీంద్ర జ‌డేజాను అంపైర్ ఇదే కార‌ణంతో మంద‌లించాడు. రెండో రోజు ఆట‌లో అశ్విన్ పిచ్ మ‌ధ్య‌లో ప‌రిగెత్త‌డంతో రెండో త‌ప్పిదంగా ప‌రిగ‌ణించి భార‌త్‌కు అంపైర్ జ‌రిమానా విధించాడు.

Dhruv Jurel : నాకే బౌన్స‌ర్ వేస్తావా.. అరంగ్రేట ఆట‌గాడు ధ్రువ్ జురెల్ దెబ్బ‌కు బిత్త‌ర‌పోయిన ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు