IND vs ENG 3rd Test : అటు చూడు.. అలా ఆడాలి.. నువ్వూ ఉన్నావ్‌..! ఇంగ్లాండ్ అంటేనే చాలు రెచ్చిపోతాడు

టీమ్ ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ అంటే చాలు విజృంభించేస్తున్నాడు.

IND vs ENG 3rd Test : అటు చూడు.. అలా ఆడాలి.. నువ్వూ ఉన్నావ్‌..! ఇంగ్లాండ్ అంటేనే చాలు రెచ్చిపోతాడు

Team India pacer Jasprit Bumrah top five highest test scores coming against england

IND vs ENG 3rd Test – Jasprit Bumrah : సాధార‌ణంగా క్రికెట‌ర్లు అంద‌రూ అన్ని జ‌ట్ల పైన ప‌రుగులు చేస్తుంటారు. అయితే.. కొంద‌రు మాత్రం ఫ‌లానా ప్ర‌త్య‌ర్థి అంటేనే చాలు రెచ్చిపోతారు. ఫామ్‌తో సంబంధం లేకుండా ప‌రుగుల వ‌ర‌ద పారిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఆస్ట్రేలియా అన‌గానే భార‌త మాజీ ఆట‌గాడు వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ చెల‌రేగిపోవ‌డాన్ని చూశాం. అలాగే ఇప్పుడు టీమ్ ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ అంటే చాలు విజృంభించేస్తున్నాడు. బంతితోనే కాదు బ్యాట్‌తోనూ ఇంగ్లాండ్‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు.

రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా 28 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, 1 సిక్స్ బాది 26 ప‌రుగులు చేశాడు. భార‌త స్కోరు 440 దాట‌డంలో త‌న వంతు పాత్ర పోషించాడు. టీమ్ఇండియా ప్ర‌ధాన బ్యాట‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్ (10), శుభ్‌మ‌న్ గిల్ (0), ర‌జ‌త్ పాటిదార్ (5) ల కంటే బుమ్రానే ఈ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేయ‌డం విశేషం.

Ravichandran Ashwin : ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన రికార్డు.. టెస్టుల్లో 500 వికెట్ల క్ల‌బ్‌లో చోటు

ఇంగ్లాండ్ జ‌ట్టు అంటేనే చాలు బుమ్రాలోని బ్యాటింగ్ స్కిల్స్ మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాయి. టెస్టుల్లో అత‌డి టాప్‌-5 అత్య‌ధిక ప‌రుగులు ఇంగ్లాండ్ పైనే చేయ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. లార్డ్స్ వేదిక‌గా 2021లో ఇంగ్లాండ్ అజేయంగా 34 ప‌రుగులు చేశాడు. ఆ త‌రువాత ఏడాది ఎడ్జ్‌బాస్ట‌న్ లో అజేయంగా 31 ప‌రుగులు, ట్రెండ్ బ్రిడ్జ్‌(2021)లో 28 ప‌రుగులు, రాజ్‌కోట్ (2024)లో 28ప‌రుగులు, ఓవ‌ల్ (2021)లో 24 ప‌రుగులు చేశాడు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో బుమ్రా కొట్టిన షాట్ల‌ను చూసి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సంబుర ప‌డిపోయాడు. ఈ క్ర‌మంలో అత‌డు శుభ్‌మ‌న్ గిల్‌తో ఏదో చెబుతున్న ఫోటో వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలో గిల్ వైఫ‌ల్యాన్ని నెటిజ‌న్లు ఎత్తి చూపుతున్నారు. అలా చూడు.. ఇంగ్లాండ్ అంటే చాలు రెచ్చిపోతాడు.. నువ్వు కూడా అలా ఆడాలి అని రోహిత్.. శుభ్‌మ‌న్ గిల్‌కు చెబుతున్న‌ట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

IND vs ENG : సున్నా నుంచి కాదు.. ఐదు ప‌రుగుల‌తో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఇంగ్లాండ్.. ఎందుకో తెలుసా?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(131), ర‌వీంద్ర జ‌డేజా (112)లు సెంచ‌రీలు చేశారు. యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (62) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో మార్క్‌వుడ్ నాలుగు వికెట్లు తీశాడు. రెహాన్ అహ్మ‌ద్ రెండు, టామ్ హార్డ్లీ, జేమ్స్ అండ‌ర్స‌న్‌, జోరూట్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.