Courtesy BCCI
శనివారం నుంచి ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభం కానుంది. చిన్నస్వామి వేదికగా మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఈ క్రమంలో ఆర్‌సీబీకి భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ ఆడడం పై అనిశ్చితి నెలకొంది. చెన్నైతో ఆడిన మ్యాచ్‌లో అతడు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకునేందుకు అతడికి చాలా సమయం పట్టవచ్చునని తెలుస్తోంది.
రజత్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ఇండియా ఏ జట్టులో కూడా అతను చోటు కోల్పోయే అవకాశం ఉందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. రజత్ పాటిదార్ తన వేలిని రక్షించుకోవడానిది స్ప్లింట్ ధరించాలని వైద్యులు సూచించినట్లుగా తెలిపింది. ఈ క్రమంలో అతడు ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ చేయడానికి కూడా వీలులేకుండా పోయింది.
Rohit Sharma : మహారాష్ట్ర సీఎంతో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయాల్లోకి హిట్‌మ్యాన్..?
రజత్ పాటిదార్ ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయితే అది ఆర్‌సీబీకి పెద్ద ఎదురుదెబ్బ కానుంది. అతడి సారథ్యంలో ఈ సీజన్‌లో బరిలోకి దిగిన ఆర్‌సీబీ అదరగొడుతోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.
ఇప్పటికే స్టార్ ఆటగాడు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ గాయం కారణంగా తప్పుకోగా అతడి స్థానంలో యయాంక్ అగర్వాల్‌ను ఆర్‌సీబీ తీసుకుంది. కాగా.. మరో స్టార్ ఆటగాడు హేజిల్‌వుడ్ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. రజత్ పటిదార్ జట్టుకు దూరం అయితే వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఆర్‌సీబీ నాయకత్వ బాధ్యతలను అందుకోనున్నాడు.
SRH : సన్‌రైజర్స్ ఊపిరి పీల్చుకో.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు..!