Breaking Limits Girls Can: బాలికల్ని ఫుట్‌బాల్‌లో ఛాంపియన్లను చేయడమే లక్ష్యంగా ‘బ్రేకింగ్ లిమిట్స్: గర్ల్స్ కెన్’
కొత్త క్యాంపెయిన్ ఈ వారంలో మొదలవుతుంది. నిజానికి భారతదేశంలో 1% కంటే తక్కువ మంది బాలికలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. కోల్‌కతాలోని ఒక ఉద్వేగభరితమైన ఆర్ట్ ఇన్‌స్టాలేషన్ ఈ అసమానతను చాటిచెప్పింది

Breaking Limits Girls Can: ఫిఫా (FIFA) మహిళల ఫుట్‌బాల్ లక్ష్యాలకు అనుగుణంగా డియోడరెంట్ బ్రాండ్ అయిన రెక్సోనా భారతదేశంలో ‘బ్రేకింగ్ లిమిట్స్: గర్ల్స్ కెన్’ సిరీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఎక్కువ మంది మహిళా ఫుట్ బాల్ ప్లేయర్స్ కు మరింత శక్తిని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఒక్కరికి వారు అనుకున్న లక్ష్యాలను అందుకునే అవకాశాలు రాకపోవచ్చు. ఇలాంటి సమయంలో రెక్సోనా లక్ష్యం కేవలం డియోడరెంట్ గా ఉండిపోవడమే కాదు, ఇది మహిళా ఫుల్ బాల్ ప్లేయర్లలో విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి, మార్పును పెంపొందించడానికి ప్రయత్నిస్తుందని రెక్సోనా ప్రతినిధి తెలిపారు.
ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, బ్రేకింగ్ లిమిట్స్ కార్యక్రమాన్ని పరిచయం చేస్తోంది. ఉద్యమ-ఆధారిత కార్యక్రమాల ద్వారా యువతలో విశ్వాసం, అవకాశాలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వారిని సన్నద్ధం చేసేందుకు కోచ్‌లు, కమ్యూనిటీ లీడర్స్, మెంటర్‌లను మెరుగుపరచడం లక్ష్యంగా ఉచిత డిజిటల్ శిక్షణా సిరీస్ ను అందిస్తుంది. కొత్తగా చేపట్టిన గర్ల్స్ కెన్ సిరీస్ కూడా బాలికలకు సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పడం, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, అన్ని జాతులను కలుపుకుని పోయేలా చేయడంపై దృష్టి పెట్టింది.
రెక్సోనా కొత్త క్యాంపెయిన్ ఈ వారంలో మొదలవుతుంది. నిజానికి భారతదేశంలో 1% కంటే తక్కువ మంది బాలికలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. కోల్‌కతాలోని ఒక ఉద్వేగభరితమైన ఆర్ట్ ఇన్‌స్టాలేషన్ ఈ అసమానతను చాటిచెప్పింది. అది ఎలా అంటే 100 తెల్లని జెర్సీని ఉన్నచోట ఒకే ఒక్క పింక్ రంగు జెర్సీ ఉన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇన్‌స్టాలేషన్‌లో నిమగ్నమైన అదితి చౌహాన్ (జాతీయ భారత మహిళల జట్టుకు గోల్‌కీపర్) లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మంచి సందేశాల్ని అందిస్తున్నారు.