WFI: డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్‌గా సంజయ్.. తట్టుకోలేక ఏడుస్తూ వెళ్లిపోయిన మహిళా రెజ్లర్.. వీడియో
బ్రిజ్ భూషణ్ సన్నిహితుడే మళ్లీ డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్‌గా ఎన్నిక కావడంతో రెజ్లర్ సాక్షి మాలిక్ తట్టుకోలేకపోయింది. మీడియాతో మాట్లాడి ఏడుస్తూ..

Sakshi Malik Sanjay Singh
Sanjay Singh: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త చీఫ్‌గా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. పోటీ చేసిన ఎనిమిది మందిలో సంజయ్ సింగ్‌కు అత్యధిక ఓట్లు రావడంతో డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సంజయ్ సింగ్ ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సొంత ప్రాంతం వారణాసి.
బ్రిజ్ భూషణ్ యాదవ్‌కు సన్నిహితుడు
మహిళా రెజ్లర్లను వేధింపులకు గురి చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు సంజయ్ సింగ్ సన్నిహితుడు.
భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు కొన్ని నెలల క్రితం నిరసనకు దిగి, చివరకు తమ ఆందోళనను విరమించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌గా ఎన్నికైన వ్యక్తి కూడా బ్రిజ్ భూషణ్ యాదవ్‌కు సన్నిహితుడే కావడంతో కొందరు రెజ్లర్లు మండిపడుతున్నారు.
రెజ్లర్ సాక్షి మాలిక్ కన్నీరు
బ్రిజ్ భూషణ్ సన్నిహితుడే మళ్లీ డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్‌గా ఎన్నిక కావడంతో రెజ్లర్ సాక్షి మాలిక్ తట్టుకోలేకపోయింది. మీడియాతో మాట్లాడి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అంతకు ముందు ఆమె మాట్లాడుతూ… ‘డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్‌గా మహిళ ఉండాలని మేము డిమాండ్ చేశాం.
మహిళే అధ్యక్షురాలిగా ఉంటే వేధింపులు జరగవు. ఈ ఎన్నికల్లో మహిళలు పాల్గొనలేదు. మా పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేసింది. సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ కొత్త చీఫ్‌గా కొనసాగితే తాను రెజ్లింగ్‌ను వదిలేస్తానని హెచ్చరించింది.
#WATCH | Delhi: Wrestler Sakshi Malik breaks down as she leaves after addressing a press conference.
Former WFI chief Brij Bhushan Sharan Singh’s aide Sanjay Singh has been elected as the new president of the Wrestling Federation of India. pic.twitter.com/Rc85nAkvgy
— ANI (@ANI) December 21, 2023