పెళ్లి తర్వాత టాయిలెట్ వెళ్తానని చెప్పిన వధువు.. ఆ తర్వాత ఏం జరిగిందో అబ్బాయిలు తప్పకుండా తెలుసుకోవాలి
పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణలో నిమగ్నమయ్యారు. దీని వెనుక క్రియాశీలక ముఠాపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Groom Escapes with Money and Gold: పెళ్లి పేరుతో దోపిడీ చేస్తున్న వధువుల గురించి ఇప్పటికే వినుంటారు. ఇలాంటి మోసాలు ఈ మధ్య పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి మోసం జరిగితే కుటుంబం మొత్తం ఆర్థికంగా దివాళా తీసిన ఘటనలు అనేకం. పెళ్లి చేసుకుని ఆ డబ్బుతో పారిపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఎదుటివారు మానసికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లయ్యాక ఓ వధువు టాయిలెట్‌కు వెళతానని సాకుగా చూపి 80 వేల నగదు, నగలతో ఉడాయించింది.
పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడే ముఠా ఈ ప్రాంతంలో చాలా కాలంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. కొత్వాలి ప్రాంతంలోని కొడారియా గ్రామంలోని ఓ ఆలయంలో తాజాగా వివాహం జరిగింది. ఆ వివాహం అనంతరం వధువు అక్కడి నుంచి సొమ్ముతో పారిపోయింది. దీంతో వరుడి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెళ్లయిన తర్వాత వధువు వెళ్లే సమయంలో మరుగుదొడ్డికి వెళ్లాలని సాకుగా చూపింది. దీంతో ఆమె కారు దిగి టాయిలెట్ వైపు వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. అక్కడికి వెళ్లి చూడగా ఆమె పరారీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణలో నిమగ్నమయ్యారు. పరారీలో ఉన్న దొంగ వధువు కోసం గాలిస్తున్నారు. దీని వెనుక ఉన్న ముఠాపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో నిందితులను త్వరలో అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
Also Read: ఇది రీల్ కాదు బాస్ రియల్.. బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదం చూస్తే ముక్కున వేలేసుకుంటారు