T20 World Cup 2021: న్యూజిలాండ్ ఓడిపోతే ఇండియా సెమీస్‌కు వెళ్లినట్లే

తొలి రెండు మ్యాచ్‌ల్లో పాక్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన.. అఫ్గానిస్థాన్‌ను దంచికొట్టి రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాల్సిన స్థితిలో........

Team India

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు సెమీస్ ఆశలు సజీవంగా కనిపిస్తున్నాయి. టోర్నీలో తొలి రెండు మ్యాచ్ లను ఘోరంగా ఓడిపోవడంతో దాదాపు అవకాశాలు కోల్పోయామనే అనుకున్నారు. కానీ, రీసెంట్ గా అఫ్ఘాన్ తో ముగిసిన మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించడంతో మరోసారి సజీవంగా కనిపిస్తున్నాయి.

తొలి రెండు మ్యాచ్‌ల్లో పాక్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన.. అఫ్గానిస్థాన్‌ను దంచికొట్టి రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాల్సిన స్థితిలో భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. గత మ్యాచ్‌ల్లాగే మరోసారి టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన.. ఈసారి 210/2 భారీ స్కోర్‌ సాధించింది. ఫలితంగా టోర్నీలోని గ్రూప్‌-2 పాయింట్ల పట్టికలో స్థానం మెరుగు పర్చుకొని నాలుగో ప్లేస్‌లో నిలిచింది.

అలా మరోసారి ఆశలు పుట్టించిన టీమిండియా సెమీస్ కు చేరాలనుకుంటున్నారు. అలా జరగాలంటే.. న్యూజిలాండ్‌ తన ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి ఓడినా టీమిండియాకు మంచి అవకాశాలు ఉంటాయి. మన జట్టు మిగతా రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో స్కాట్లాండ్‌, నమీబియాలపై నెగ్గి రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాల్సి ఉంది. టీమిండియా ప్రస్తుత రన్‌రేట్‌ 0.073.

……………………………………….. : బాలకృష్ణ షోలో చంద్రబాబు గురించి ప్రశ్నించిన మోహన్ బాబు

మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు కష్టమేం కాదు. కివీస్‌ మాత్రం ఆ రెండు జట్లతో ఓడాలంటే అద్భుతం జరగాల్సిందే. అంటే టీమిండియా గెలవడం కంటే కివీస్ ఓటమినే కోరుకుంటున్నారు టీమిండియా అభిమానులు. ఈ నేపథ్యంలో భారత అభిమానుల ఆశలన్నీ ప్రధానంగా అఫ్గాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌పైనే పడ్డాయి.

బుధవారం జరిగిన మ్యాచ్ లో ఎట్టకేలకు వరల్డ్ కప్ లో భారత జట్టు బోణీ కొట్టింది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ చేతిలో కంగుతిన్న టీమిండియా.. అఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం నమోదు చేసింది. భారత్ నిర్దేశించిన భారీ టార్గెట్ ను అప్ఘానిస్తాన్ చేధించలేకపోయింది. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.