IND vs AUS : టెస్టు ఫార్మాట్ క్రికెట్‌లో రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు.. వారిద్దరి తరువాత హిట్‌మ్యానే

రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోర్ లకే పెవిలియన్ బాట పట్టాడు.

Captain Rohit Sharma

IND vs AUS 2nd Test Rohit Sharma: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆసీస్ గడ్డపై ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగుతుంది. తొలి టెస్టులో భారత్ జట్టు ఘన విజయం సాధించగా.. రెండో టెస్టులో ఓటమి దిశగా పయనిస్తుంది. అయితే, తొలి టెస్టులో రోహిత్ శర్మ గైర్హాజరవగా.. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోర్ లకే పెవిలియన్ బాట పట్టాడు.

Also Read: Rishabh Pant : రిష‌బ్ పంత్‌కు అత్యాశ‌.. అందుక‌నే మెగావేలంలోకి.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొత్త కోచ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్ లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో 15బంతులు ఎదుర్కొన్న రోహిత్.. కేవలం ఆరు పరుగులకే ఔట్ అయ్యాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే, ఆడిలైడ్ టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలోనూ విఫలమవ్వడంతో రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు నమోదైంది.

Also Read: England : టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో 5 ల‌క్షల ప‌రుగులు చేసిన తొలి జ‌ట్టుగా ఇంగ్లాండ్‌.. భార‌త్ ర‌న్స్ ఎన్నంటే..?

రెండు ఇన్నింగ్స్ లలో సింగిల్ డిజిట్ స్కోర్ కే ఔట్ కావడం రోహిత్ శర్మకు ఇది మూడో టెస్ట్ మ్యాచ్. ఒక క్యాలెండర్ ఏడాదిలో మూడు టెస్టు మ్యాచ్ లలో ఈ విధంగా ఔటైన కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కంటే ముందు వరుసలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య, బంగ్లాదేశ్ ఆటగాడు మోమినుల్ హక్ ఈ జాబితాలో ఉన్నారు. 2001లో జయసూర్య, 2022లో మోమినుల్ ఇద్దరూ చెరో మూడు టెస్ట్ మ్యాచ్ లలో తీవ్రంగా నిరాశపర్చారు.