England : టెస్టు క్రికెట్ చరిత్రలో 5 లక్షల పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లాండ్.. భారత్ రన్స్ ఎన్నంటే..?
క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ జట్టు అరుదైన ఘనత సాధించింది

England Become 1st Team To Score 5 Lakh Runs In Test Cricket History
క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ జట్టు అరుదైన ఘనత సాధించింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కానీ ఓ రికార్డును అందుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో 5లక్షలకు పైగా పరుగులు సాధించిన తొలి జట్టుగా అవతరించింది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఈ ఘనత అందుకుంది. ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్‌కు ఇది 1082 టెస్టు. ఇక ఇంగ్లాండ్ తరువాత ఆస్ట్రేలియా అత్యధిక పరుగులు చేసింది. 4,28,868 పరుగులతో రెండో స్థానంలో ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే.. 2,78,751 పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.
IND vs AUS : జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన లబుషేన్..
అంతేకాదండోయ్.. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ఇంగ్లాండ్ పేరిటే ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇప్పటి వరకు 929 సెంచరీలు నమోదు చేశారు. ఆ తరువాత ఆస్ట్రేలియా అత్యధికంగా 592 సెంచరీలతో రెండో స్థానంలో ఉంది. ఇక భారత బ్యాటర్లు 552 శతకాలు బాదారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేసింది. అనంతరం కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ కు 155 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. జోరూట్ (73), బెన్‌స్టోక్స్ (35) లు క్రీజులో ఉన్నారు. బెన్ డకెట్ (92), జాకబ్ బెథెల్ (96) తృటిలో సెంచరీలను చేజార్చుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 533 పరుగుల ఆధిక్యంలో ఉంది.
SA vs SL : ఏమప్పా ఇదీ.. రబాడ బ్యాట్‌ను విరగొట్టిన శ్రీలంక క్రికెటర్..
500,000 reasons to love England ❤️ pic.twitter.com/yvm1wRogeE
— England Cricket (@englandcricket) December 7, 2024