IND vs AUS : జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన లబుషేన్..
అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వచ్చేసింది.

Yashasvi Jaiswal took stunning catch
అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వచ్చేసింది. రెండో రోజు తొలి సెషన్ ముగిసింది. ఆసీస్ 59 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (53), మిచెల్ మార్ష్ (2) లు క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 11 పరుగుల ఆధిక్యంలో ఉంది.
కాగా.. రెండో రోజు ఆటలో యశస్వి జైస్వాల్ అద్భతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 55 ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌ను నితీశ్ రెడ్డి వేశాడు. అప్పటికే 64 పరుగులతో లబుషేన్ చాలా బాగా ఆడుతున్నాడు. బౌండరీల మోత మోగిస్తున్నాడు. మూడో బంతికి లబుషేన్ షాట్ ఆడాడు. బంతి ఖచ్చితంగా బౌండరీ వెలుతుందని లబుషేన్ భావించాడు. అయితే.. జైస్వాల్ సన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీన్ని చూసిన లబుషేన్ బిత్తరపోయాడు. నిరాశతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ప్రస్తుతం జైస్వాల్ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రెండో రోజు ఉదయం ఓవర్ నైట్ స్కోరు 86/1 స్కోరుతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ ను ఆరంభించింది. అయితే.. ఆరంభంలోనే జస్‌ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాకు షాకిచ్చాడు. ఓవర్‌నైట్ స్కోరుకు మరో పరుగు మాత్రమే జోడించిన నాథన్ మెక్‌స్వీనీ (39) బుమ్రా బౌలింగ్‌లో పంత్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరికాసేటికే స్టీవ్‌స్మిత్ (2)ను బుమ్రా బుట్టలో వేశాడు. దీంతో ఆసీస్ 103 పరులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో ఓవర్‌నైట్ బ్యాటర్ లబుషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. వీరిద్దరు భారత బౌలర్ల పై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో లబుషేన్ అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిన నితీశ్ రెడ్డి విడగొట్టాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
SA vs SL : ఏమప్పా ఇదీ.. రబాడ బ్యాట్‌ను విరగొట్టిన శ్రీలంక క్రికెటర్..
A STUNNING CATCH BY YASHASVI JAISWAL….!!!! 👌 pic.twitter.com/aTp3xx26bt
— Johns. (@CricCrazyJohns) December 7, 2024