NZ vs ENG : ఐపీఎల్‌లో అన్‌సోల్డ్.. కట్ చేస్తే.. న్యూజిలాండ్ పై హ్యాట్రిక్ సాధించిన ఇంగ్లీష్ పేసర్
ఇంగ్లాండ్ స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ అరుదైన ఘనత సాధించాడు.

Gus Atkinson floors New Zealand with maiden Test hat trick
ఇంగ్లాండ్ స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్ అరుదైన ఘనత సాధించాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అతడు హ్యాట్రిక్ సాధించాడు. ఇంగ్లాండ్ తరుపున టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన 15వ బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఇంగ్లీష్ బౌలర్లలో అతడి కంటే ముందు 2017లో మెయిన్ అలీ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ 2017లో దక్షిణాప్రికా పై ఈ ఘనత అందుకున్నాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 35వ ఓవర్‌లో గస్ అట్కిన్సన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతిని నాథన్ స్మిత్ ఫోర్ గా మలిచిచాడు. అయితే.. మూడో బంతికి నాథన్ స్మిత్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో బంతికి హెన్రీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక ఐదో బంతికి టిమ్ సౌథీని వికెట్ ముందు దొరకబుచ్చుకుని హ్యాట్రిక్ అందుకున్నాడు అట్కిన్సన్. సుదీర్ఘ ఫార్మాట్‌లో అట్కిన్సన్ ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం.
SA vs SL : ఏమప్పా ఇదీ.. రబాడ బ్యాట్‌ను విరగొట్టిన శ్రీలంక క్రికెటర్..
కాగా.. ఈ పేసర్ ను ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఎవ్వరూ తీసుకోలేదు. కనీస ధర 2 కోట్లతో వేలంలో అడుగుపెట్టాడు. అయితే.. అతడిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేసింది. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన న్యూజిలాండ్ అట్కిన్సన్ ధాటికి 125 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ కు 155 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
IND vs AUS : అరుదైన ఘనత సాధించిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ ఏడాది టెస్టుల్లో ఒకే ఒక్కడు..
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. జోరూట్ (73), బెన్‌స్టోక్స్ (35) లు క్రీజులో ఉన్నారు. బెన్ డకెట్ (92), జాకబ్ బెథెల్ (96) తృటిలో సెంచరీలను చేజార్చుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 533 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Gus Atkinson Hat Trick
NZ v Eng – 2nd Test Day 2 pic.twitter.com/WlyTEBtj8P— Juan der Rérre (@InLoveWithAView) December 6, 2024