IND vs AUS : అరుదైన ఘ‌న‌త సాధించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. ఈ ఏడాది టెస్టుల్లో ఒకే ఒక్క‌డు..

టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా ఓ అరుదైన ఘ‌నత సాధించాడు.

IND vs AUS : అరుదైన ఘ‌న‌త సాధించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. ఈ ఏడాది టెస్టుల్లో ఒకే ఒక్క‌డు..

Bumrah joins Kapil Dev in elite list with 50 Test wickets this year

Updated On : December 6, 2024 / 7:51 PM IST

టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా ఓ అరుదైన ఘ‌నత సాధించాడు. ఈ ఏడాది టెస్టులో 50 వికెట్లు ప‌డ‌గొట్టిన మొద‌టి బౌల‌ర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో ఉస్మాన్ ఖ‌వాజాను ఔట్ చేయ‌డం ద్వారా బుమ్రా ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. 11 మ్యాచుల్లో బుమ్రా 50 వికెట్లు తీశాడు. ఇక బుమ్రా త‌రువాతి స్థానాల్లో అశ్విన్ (46), షోయ‌బ్ బ‌షీర్ (45)లు ఉన్నారు.

ఈ ఏడాది టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు..
* జ‌స్‌ప్రీత్ బుమ్రా – 50 వికెట్లు
* ర‌విచంద్ర‌న్ అశ్విన్ – 46 వికెట్లు
* షోయ‌బ్ బ‌షీర్ – 45 వికెట్లు
* ర‌వీంద్ర జ‌డేజా – 44 వికెట్లు
* గ‌స్ అట్కిస్క‌న్ – 44 వికెట్లు

IND vs AUS : స‌హ‌నం కోల్పోయిన సిరాజ్‌.. ల‌బుషేన్ పైకి బంతిని విసేరేశాడు.. వీడియో

ఇక ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో 50 లేదా అంత‌కంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భార‌త పేస‌ర్‌గానూ బుమ్రా రికార్డుల‌కు ఎక్కాడు. అంత‌క‌ముందు ఈ జాబితాలో క‌పిల్ దేవ్, జ‌హీర్ ఖాన్ లు ఉన్నారు. 1979లో 17 మ్యాచుల్లో కపిల్ 74 వికెట్లు తీశాడు. ఆ త‌రువాత 1983లో 18 టెస్టుల్లో 75 వికెట్లు తీసి త‌న రికార్డును తానే మెరుగుప‌ర‌చుకున్నాడు. 2002లో జ‌హీర్ ఖాన్ 15 మ్యాచుల్లో 51 వికెట్లు సాదించాడు.

ఓ ఏడాదిలో 50 ఫ్ల‌స్ వికెట్లు తీసిన భార‌త పేస‌ర్లు వీరే..
* క‌పిల్ దేవ్ – 1979లో 74 వికెట్లు (17 మ్యాచుల్లో)
* క‌పిల్ దేవ్ – 1983లో 75 వికెట్లు (18 మ్యాచుల్లో)
* జ‌హీర్ ఖాన్ – 2002లో 51 వికెట్లు (15 మ్యాచుల్లో)
* జ‌స్‌ప్రీత్ బుమ్రా – 2024లో 50* వికెట్లు (11 మ్యాచుల్లో)

IND vs AUS : పింక్‌బాల్‌ టెస్టులో ప‌ట్టు బిగిస్తున్న ఆస్ట్రేలియా.. తొలి రోజు ముగిసిన ఆట‌..