IND vs AUS : పింక్‌బాల్ టెస్టులో పట్టు బిగిస్తున్న ఆస్ట్రేలియా.. తొలి రోజు ముగిసిన ఆట..
అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది.

IND vs AUS 2nd Test Day 1Stumps Australia trail by 94 runs
అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో వికెట్ నష్టపోయి 86 పరుగులు చేసింది. మార్నస్ లబుషన్ (20), నాథన్ మెక్‌స్వీనీ (38) లు క్రీజులో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆస్ట్రేలియా ఇంకా 94 పరుగుల వెనుకబడి ఉంది.
భారత్‌ను ఆలౌట్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఆస్ట్రేలియాకు మొదట్లోనే షాక్ తగిలింది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో రోహిత్ శర్మ క్యాచ్ అందుకోవడంతో ఉస్మాన్ ఖవాజా ఔట్ అయ్యాడు. దీంతో 24 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ కి లబుషేన్ జత కలిశాడు. వీరిద్దరు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.
IND vs AUS : చీకటిమయమైన అడిలైడ్ మైదానం.. ఇలాగైతే ఆడేదెలా.. ఆస్ట్రేలియాలో కరెంట్ కష్టాలు..!
ఆరంభంలోనే ఔటైయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మెక్‌స్వీనీ ఆ తరువాత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మరోవైపు తనదైన శైలిలో లబుషేన్ గోడలా నిలబడ్డాడు. క్రీజులో కుదురుకున్న తరువాత వీరు స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. మరో వికెట్ పడకుండా మొదటి రోజు ఆటను ముగించారు. వీరిద్దరు అభేధ్యమైన రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు.
అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్, బొలాండ్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Syed mushtaq ali trophy : 20 ఓవర్లలో 349 పరుగులు.. టీ20 క్రికెట్‌లో బరోడా ప్రపంచ రికార్డు..
It was all Mitchell Starc early, while Nathan McSweeney found his feet later on day one. #AUSvIND pic.twitter.com/VIHuziDrh3
— cricket.com.au (@cricketcomau) December 6, 2024