Syed mushtaq ali trophy : 20 ఓవర్లలో 349 పరుగులు.. టీ20 క్రికెట్‌లో బరోడా ప్రపంచ రికార్డు..
టీ20 క్రికెట్‌లో బరోడా టీమ్ సంచలనం సృష్టించింది.

Baroda registers world record T20 team score in SMAT match against Sikkim
టీ20 క్రికెట్‌లో బరోడా టీమ్ సంచలనం సృష్టించింది. పొట్టి క్రికెట్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో భాగంగా సిక్కంతో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కృనాల్ పాండ్య నాయకత్వంలో బరిలోకి దిగిన బరోడా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.
కాగా.. టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకు జింబాబ్వే పేరిట ఈ రికార్డు ఉండేది. టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో గాంబియాపై జింబాబ్వే 344-4 స్కోరు సాధించింది. ఇప్పుడు బరోడా ఈ రికార్డు బ్రేక్ చేసింది.
WI vs BAN : రెండో టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. వెస్టిండీస్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ..
ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న భాను పానియా కేవలం 51 బంతుల్లో 5 ఫోర్లు, 15 సిక్సర్లు బాది 134 పరుగులు చేశాడు. పానియాతో పాటు, శశ్వత్ రావత్ (16 బంతుల్లో 43), అభిమన్యు సింగ్(17 బంతుల్లో 53), శివాలిక్ శర్మ(17 బంతుల్లో 55), విష్ణు సోలంకి (16 బంతుల్లో 50) లు దూకుడుగా ఆడాడరు. సిక్కిం బౌలర్లలో పల్జోర్ తమాంగ్, రోషన్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. తరుణ్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం సిక్కిం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 86 పరుగులకే పరిమితమైంది. దీంతో బరోడా 263 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
IND vs AUS : యశస్వి జైస్వాల్ స్లెడ్జింగ్ పై తొలిసారి స్పందించిన మిచెల్ స్టార్క్..
కాగా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఒక జట్టు ఇన్నింగ్స్‌లో 300కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి.
🚨 HISTORY CREATED IN SMAT. 🚨
– Baroda smashed record 349/5 in 20 overs in SMAT, the highest ever score in the history of T20 cricket. 🤯 pic.twitter.com/ptS4j3t8vO
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 5, 2024