WI vs BAN : రెండో టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. వెస్టిండీస్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ..
అసలే ఓటమి బాధలో ఉన్న విండీస్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది.

ICC punishes West indies bowlers seales and sinclair for misconduct
WI vs BAN : వెస్టిండీస్ గడ్డ పై బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. జమైకాలోని సబీనా పార్క్ స్టేడియంలో విండీస్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 287 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. కాగా.. విండీస్ గడ్డ పై 15 ఏళ్ల తరువాత బంగ్లాదేశ్‌కు ఇదే మొదటి విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది. అసలే ఓటమి బాధలో ఉన్న విండీస్‌కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది.
ఇద్దరు వెస్టిండీస్ ప్లేయర్లపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వెస్టిండీస్ పేసర్ జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్ లు ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేల్చింది. వారికి జరిమానాలు విధించింది.
IND vs AUS : యశస్వి జైస్వాల్ స్లెడ్జింగ్ పై తొలిసారి స్పందించిన మిచెల్ స్టార్క్..
రెండో టెస్టు మ్యాచ్‌లో 23 ఏళ్ల పేసర్ జేడెన్ సీల్స్ ఓ వికెట్ తీసిన సమయంలో బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్ వైపు దూకుడు సంజ్ఞలు చేశాడు. ఇది ఆట స్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తన అని ఐసీసీ తెలిపింది. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 25 జరిమానాగా విధించింది. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను జోడించింది.
కాగా.. 25 ఏళ్ల స్పిన్నర్ కెవిన్ సింక్లైర్ రెండో టెస్టులో తుది జట్టులో ఆడలేదు. అయితే.. అతడు మ్యాచ్ సమయంలో అంపైర్లను అగౌరపరిచాడు. వారి హెచ్చరికలను పట్టించుకోలేదని ఐసీసీ తెలిపింది. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించినల్లు తెలిపింది. ఇక ఈ ఇద్దరూ కూడా తమ తప్పులను అంగీకరించారని, దీంతో తదుపరి విచారణ ఉండదని వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. రెండు టెస్టు మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేసినందుకు జేడెన్ సీల్స్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అతడు రెండు టెస్టుల్లో మొత్తం 10 వికెట్ల పడగొట్టాడు.