IND vs AUS : రెండో టెస్టుకు ఒక్క రోజు ముందే.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. భారత్‌కు దబిడిదిబిడే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాభవాన్ని చవిచూసింది.

Pat Cummins Confirms Australia Playing 11 For Adelaide test
IND vs AUS 2nd Test : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో తుది జట్టులో కొన్ని మార్పులు ఉంటాయని భావించారు. తొలి టెస్టులో గాయపడిన మిచెల్ మార్ష్ రెండో టెస్టులో ఆడడని, అదే సమయంలో ప్రాక్టీస్ సెషన్‌లో స్టీవ్ స్మిత్, లబుషేన్‌లు గాయపడ్డారని వీరు పింక్ బాల్ టెస్టు ఆడడం కష్టమేనని వార్తలు వచ్చాయి. కాగా.. రెండో టెస్టు ప్రారంభానికి ఒక రోజు ముందే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తుది జట్టును ప్రకటించాడు.
తొలి టెస్టు ఆడిన జట్టుతోనే దాదాపుగా బరిలోకి దిగనున్నట్లు చెప్పాడు. కేవలం ఒక్క మార్పు మాత్రమే చోటు చేసుకుంది. గాయం కారణంగా జోష్ హాజల్‌వుడ్ ఈ మ్యాచ్ నుంచి తప్పుకోగా అతడి స్థానంలో స్కాట్ బోలాండ్‌ను తీసుకుంటున్నట్లు చెప్పాడు. మిచెల్ మార్ష్ బాగానే ఉన్నాడని, స్టీవ్ స్మిత్, లబుషేన్‌లు సైతం ఫిట్‌గానే ఉన్నట్లు వెల్లడించాడు.
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం వేళ విరాట్ కోహ్లీపై అక్తర్ వివాదాస్పద వ్యాఖలు
2023లో లీడ్స్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ తరుపున చివరి మ్యాచ్ ఆడాడు బోలాండ్. దాదాపు సంవత్సరం తరువాత అతడు టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఆస్ట్రేలియా తరుపున ఇప్పటి వరకు బొలాండ్ 10 టెస్టులు ఆడాడు. 35 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ సారి 5 వికెట్ల ప్రదర్శనను చేశాడు. అతడు ఆడిన టెస్టుల్లో రెండు పింక్ బాల్ టెస్టులు ఉన్నాయి.
రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే..
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
JUST IN: Skipper Pat Cummins confirms one change for Australia for the second Test #AUSvIND
Details: https://t.co/Q0VdwRyLQs pic.twitter.com/IklVy2a5Zc
— cricket.com.au (@cricketcomau) December 5, 2024