IND vs AUS : యశస్వి జైస్వాల్ స్లెడ్జింగ్ పై తొలిసారి స్పందించిన‌ మిచెల్ స్టార్క్..

పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ అద‌ర‌గొట్టాడు.

IND vs AUS : యశస్వి జైస్వాల్ స్లెడ్జింగ్ పై తొలిసారి స్పందించిన‌ మిచెల్ స్టార్క్..

Mitchell Starc issues an official statement on Jaiswal sledging him

Updated On : December 5, 2024 / 11:25 AM IST

IND vs AUS : పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ అద‌ర‌గొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫ‌లం అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శ‌త‌కంతో చెల‌రేగి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్ సంద‌ర్భంగా అత‌డు ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్‌ను స్లెడ్జ్ చేశాడు. నువ్వు చాలా నెమ్మ‌దిగా బౌలింగ్ చేస్తున్నావు అని అన్నాడు. ఆ స‌మ‌యంలో స్టార్క్ ఎలాంటి మాట‌లు మాట్లాడ‌లేదు. న‌వ్వుతూ వెళ్లిపోయాడు.

తాజాగా య‌శ‌స్వి స్లెడ్జింగ్ పై మిచెల్ స్టార్క్ స్పందించాడు. ఆ స‌మ‌యంలో తాను య‌శ‌స్వి జైసాల్ అన్న‌ మాట‌ల‌ను విన‌లేద‌ని చెప్పాడు. క్రికెట్ ఆస్ట్రేలియా పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే.. నేను చాలా నెమ్మ‌దిగా బౌలింగ్ చేస్తాన‌ని అత‌డు చెప్ప‌డం నేను విన‌లేదు.’  అని స్టార్ అన్నాడు.

IND vs AUS : రెండో టెస్టుకు ఒక్క రోజు ముందే.. తుది జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా.. భార‌త్‌కు ద‌బిడిదిబిడే..

ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్ల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ గురించి మ‌రింతగా వివ‌రించాడు. జైస్వాల్‌ను తాను రెచ్చగొట్టిన ఘ‌ట‌న‌ను వివ‌రించాడు. ఓ బంతిని అత‌డు ప్లిక్ షాట్ ఆడాడు. ఆ బాల్ సిక్స్‌గా వెళ్లింది. మ‌రోసారి దాదాపుగా అలాంటి బంతినే వేశాను. అప్పుడు అత‌డు డిఫెన్స్ ఆడాడు. ఆ స‌మ‌యంలో నేను “ఫ్లిక్ షాట్ ఎక్క‌డ” అని అత‌డిని అడిగాను. అప్పుడు అత‌డు న‌న్ను చూసి న‌వ్వాడు. నేను న‌వ్వాను. దీన్ని అక్క‌డితో వ‌దిలేశాము అని చెప్పాడు.

అదే స‌మ‌యంలో య‌శ‌స్వి జైస్వాల్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు స్టార్క్. అత‌డు భ‌విష్య‌త్తులో స్టార్ ప్లేయ‌ర్ అవుతాడ‌న్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు అద్భుతంగా ఆడాడ‌ని మెచ్చుకున్నాడు. ప‌రిస్థితుల‌కు అత‌డు తొంద‌ర‌గా అల‌వాటు ప‌డ్డాడ‌ని అన్నాడు. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఎలాంటి భ‌యం లేకుండా ఆడే యువ ఆట‌గాళ్ల‌లో యశ‌స్వి ముందు ఉంటాడ‌ని చెప్పాడు.

ACC U19 Asia Cup 2024 : అండ‌ర్‌-19 ఆసియా క‌ప్ సెమీస్‌కు భార‌త్‌.. దంచికొట్టిన 13 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ..