IND vs AUS : చీకటిమయమైన అడిలైడ్ మైదానం.. ఇలాగైతే ఆడేదెలా.. ఆస్ట్రేలియాలో కరెంట్ కష్టాలు..!
అడిలైడ్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది

Flood lights go off twice at the Adelaide Oval during Australian innings
అడిలైడ్‌లోని ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ పింక్ బాల్ టెస్టు మొదటి రోజు ఆటలో అనుకోని అవాంతరం ఏర్పడింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా రెండు సార్లు మైదానంలోకి ఫ్లడ్‌లైట్లు బంద్ అయ్యాయి. దీంతో మైదానం మొత్తం చీకటి మయం అయింది. ఇలా రెండు సార్లు జరిగింది. అది కూడా ఒకే ఓవర్‌లో. దీంతో అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా కాస్త అసహనానికి గురి అయ్యారు.
ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. టీమ్ఇండియా పేసర్ హర్షిత్ రాణా ఈ ఓవర్‌ను వేశాడు. రెండో బంతి వేసిన అనంతరం ఒక్కసారిగా ఫ్లడ్‌లైట్లు బంద్ అయ్యాయి. దీంతో మైదానం మొత్తం చీకటిగా మారింది. ఆ తరువాత లైట్లు వెలగడంతో దాదాపు రెండు నిమిషాల అనంతరం మ్యాచ్ ప్రారంభమైంది.
IND vs AUS : యశస్వి జైస్వాల్ చెత్త రికార్డ్.. టెస్టుల్లో తొలి భారత బ్యాటర్‌గా..
ఇక ఇదే ఓవర్‌లో నాలుగో బంతి తరువాత మరోసారి ఇలాగే జరిగింది. దీంతో బౌలర్ హర్షిత్ రాణా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. మరోవైపు ఫ్యాన్స్ తమ మొబైల్ ఫోన్ లైట్లను వేశారు. ఈ సారి దాదాపు 5 నుంచి 7 నిమిషాల పాటు ఇది కొనసాగింది. చివరికి లైట్లు వెలగడంతో ఆట పునఃప్రారంభమైంది. అయితే.. ఇలా ఏ కారణం చేత జరిగిందో మాత్రం తెలియరాలేదు.
కాగా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలో కరెంట్ కష్టాలు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా 25 ఓవర్లు పూర్తి అయ్యే సరికి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోయి 70 పరుగులు చేసింది. లబుషేన్ (17), నాథన్ మెక్‌స్వీనీ (27) లు క్రీజులో ఉన్నారు.
The lights went out twice in quick succession at Adelaide Oval, but play has resumed. #AUSvIND pic.twitter.com/u6Jtd39Utc
— cricket.com.au (@cricketcomau) December 6, 2024