ACC U19 Asia Cup 2024 : దంచికొట్టిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్..
షార్జా వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ అదరగొడుతోంది.

ACC U19 Asia Cup 2024 India beat SriLanka and enter into final
షార్జా వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ అదరగొడుతోంది. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 21.4 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది.
టీమ్ఇండియా బ్యాటర్లలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మెరుపు అర్థశతకాన్ని బాదాడు. 24 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 36 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 67 పరుగులు చేశాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే (34) రాణించారు. లంక బౌలర్లలో విహాస్ థెవ్మిక, విరన్ చాముదిత, ప్రవీణ్ మనీషా లు తలా ఓ వికెట్ తీశారు.
IND vs AUS : పింక్ బాల్ టెస్టు.. రాణించిన నితీశ్ రెడ్డి.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 ఆలౌట్
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. లక్విన్ (69) హాఫ్ సెంచరీ చేశాడు. షరుజన్ (42) రాణించాడు. భారత బౌలర్లలో చేతన్ శర్మ మూడు వికెట్లు తీశాడు. కిరణ్, ఆయుష్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్, గుహ లు చెరో వికెట్ సాధించారు. భారత బౌలర్ల ధాటికి లంక 8 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లక్విన్ – షరుజన్ జోడీ లంకను ఆదుకుంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత భారత బౌలర్లు మరోసారి విజృంభించడంతో లంక ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైంది.
ఇక ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 8 ఆదివారం జరగనుంది.
IND vs AUS : రోహిత్.. ఇది నీకు అవసరమా చెప్పు.. త్యాగం చేశావ్.. ఇప్పుడు చూడు ఏమైందో..
Vaibhav Sooryavanshi is making the Lankans tremble 💪
The 13-year-old scores 3️⃣1️⃣ runs in the 2️⃣nd over against 🇱🇰 in the #ACCMensU19AsiaCup Semi-Final 🔥
Watch #SLvIND, LIVE on #SonyLIV 📲 pic.twitter.com/ppIdd1BXA8
— Sony LIV (@SonyLIV) December 6, 2024