IND vs AUS : రోహిత్.. ఇది నీకు అవసరమా చెప్పు.. త్యాగం చేశావ్.. ఇప్పుడు చూడు ఏమైందో..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్‌ను ఓ సారి పరిశీలిస్తే అతడు ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ సాధించాడు.

No middle order party for Rohit Sharma Horrible Test year continues
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్‌ను ఓ సారి పరిశీలిస్తే అతడు ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ సాధించాడు. వన్డేలు, టెస్టులు, టీ20లు ఇలా ఏ ఫార్మాట్ తీసుకున్నా కూడా ఓపెనర్‌గానే రోహిత్ అదరగొట్టాడు. మిడిల్ ఆర్డర్‌లో లేదా ఇంకెక్కడ అయినా బ్యాటింగ్‌కు దిగిన ప్రతి సందర్భంలో దాదాపుగా విఫలం అయ్యాడు. తాజాగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ ఘోరంగా విఫలం అయ్యాడు.
వ్యక్తిగత కారణాలతో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడలేదు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన కేఎల్ రాహుల్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో రెండో టెస్టు మ్యాచ్‌లోనూ అతడిని ఓపెనర్‌గానే బరిలోకి దించాలని పలువురు మాజీ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ డిమాండ్ చేశారు.
ఇక రెండో టెస్టు మ్యాచ్‌కు అందులోబాటులోకి వచ్చిన హిట్‌మ్యాన్.. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన యశస్వి, రాహుల్ జోడీని మార్చవద్దని డిసైడ్ అయ్యాడు. జట్టుకు ఏదీ మంచిది అనిపిస్తే అదే చేస్తానని, తన స్థానాన్ని మార్చుకునేందుకు సిద్ధం అని చెప్పాడు.
ఈ క్రమంలో రెండో టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ 37 పరుగులు చేయగా, ఆరో స్థానంలో బరిలోకి దిగిన రోహిత్ శర్మ 23 బంతులు ఆడి కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ (7), యశస్వి జైస్వాల్ (0)విఫలం అయ్యారు.
Syed mushtaq ali trophy : 20 ఓవర్లలో 349 పరుగులు.. టీ20 క్రికెట్‌లో బరోడా ప్రపంచ రికార్డు..
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది టెస్టుల్లో రోహిత్ శర్మ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజా మ్యాచ్‌తో కలిపి ఈ ఏడాది 7 మ్యాచులు ఆడాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 12.36 సగటుతో 139 పరుగులు మాత్రమే చేశాడు.