IND vs AUS : కోహ్లీ కాక అంత తొంద‌ర ఎందుకు.. విరాట్ ను మైదానంలోకి రానివ్వ‌ని ఫోర్త్ అంపైర్‌.. వీడియో..

అడిలైడ్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జట్ల మ‌ధ్య ప్రారంభ‌మైన రెండో టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది.

IND vs AUS : కోహ్లీ కాక అంత తొంద‌ర ఎందుకు.. విరాట్ ను మైదానంలోకి రానివ్వ‌ని ఫోర్త్ అంపైర్‌.. వీడియో..

Kohli sent back after he walks out to bat on Boland no ball incident

Updated On : December 6, 2024 / 12:52 PM IST

అడిలైడ్ వేదిక‌గా భార‌త్‌, ఆస్ట్రేలియా జట్ల మ‌ధ్య ప్రారంభ‌మైన రెండో టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌నకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ తొలి బంతికే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. అయితే.. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన గిల్‌తో క‌లిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నాడు. కాగా.. 8వ ఓవ‌ర్‌ను స్కాట్ బొలాండ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని తొలి బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు రాహుల్‌. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీప‌ర్ చేతుల్లోకి వెళ్లింది.

IND vs AUS: అయ్యో.. తొలి బంతికే స్టార్క్‌కు దొరికిపోయిన యశస్వీ జైస్వాల్.. వీడియో వైరల్

దీంతో ఔటైయ్యాన‌ని భావించిన కేఎల్ రాహుల్ పెవిలియ‌న్ వైపుగా వెలుతున్నాడు. అయితే.. బోలాండ్ క్రీజు దాటి బంతిని వేసిన‌ట్లుగా (నోబాల్‌) గుర్తించాడు థ‌ర్డ్ అంపైర్‌. వెంట‌నే మైదానంలోని అంపైర్‌కు నోబాల్ సంకేతాలు పంపాడు. దీంతో కేఎల్‌ను వెన‌క్కి పిలిపించాడు అంపైర్‌. అదే స‌మ‌యంలో రాహుల్ ఔటైన‌ట్లుగా భావించిన విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లోకి వ‌చ్చేందుకు సిద్ధం అయ్యాడు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద‌కు చేరుకున్నాడు. నోబాల్ అని తెలియ‌గానే అత‌డిని ఫోర్త్ అంపైర్ గ్రౌండ్‌లోకి రానివ్వ‌లేదు.

విష‌యం తెలుసుకున్న కోహ్లీ సైతం వెంట‌నే మ‌ళ్లీ డ్రైస్సింగ్ రూమ్ బాట ప‌ట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. కాగా.. ఈ మ్యాచ్‌లో అదృష్టం క‌లిసి వ‌చ్చినా రాహుల్ స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. 37 ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు. అటు పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ‌త‌కంతో చెల‌రేగిన కోహ్లీ సైతం 8 బంతుల్లో 7 ప‌రుగులు చేసి ఔటైయ్యాడు.

ICC Champions Trophy: పాక్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ.. ఛాంపియన్స్ ట్రోపీలో భార‌త్ ఆడే మ్యాచ్‌ల‌న్నీ అక్క‌డే..!

ప్ర‌స్తుతం మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త్ 28 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 91 ప‌రుగులు చేసింది. రిష‌బ్ పంత్ (10), నితీశ్ రెడ్డి (0) లు క్రీజులో ఉన్నారు.